అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు నాగచైతన్య. గతకొంతకాలం నుంచి చైతూకి బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. సరైన హిట్ లేక అక్కినేని హీరోలు సతమతమవుతున్నారు. సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు అనకున్నంతగా విజయాన్ని ఇవ్వలేకపోయాయి.
ప్రస్తుతం నాగ చైతన్య మజిలీ, వెంకీమామా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో హిట్ కొట్టిన మేర్లపాక గాంధీని దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మస్తున్న చిత్రంలో చైతు నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment