ఫ్లాప్ హీరో కోసం సక్సెస్ఫుల్ టీం | Maruthi, Uv Creations movie with Havish | Sakshi
Sakshi News home page

ఫ్లాప్ హీరో కోసం సక్సెస్ఫుల్ టీం

Published Thu, Apr 7 2016 9:07 AM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM

ఫ్లాప్ హీరో కోసం సక్సెస్ఫుల్ టీం

ఫ్లాప్ హీరో కోసం సక్సెస్ఫుల్ టీం

జీనియస్ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో 'హవీష్'. తొలి సినిమాతోనే భారీ ప్రచారం దక్కినా.., సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు ఈ యంగ్ హీరో. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకొని మరోసారి రామ్లీలా సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఈ సారి కూడా లక్ వర్కవుట్ కాలేదు. మరోసారి డిజాస్టర్ టాక్ రావటంతో కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.
 
తాజాగా ఓ సక్సెస్ఫుల్ టీం తెరకెక్కించబోయే సినిమాలో హవీష్కు హీరోగా ఛాన్స్ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. భలే భలే మొగాడివోయ్ సినిమాతో దర్శకుడిగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న మారుతి, ప్రస్తుతం వెంకటేష్ హీరోగా బాబు బంగారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత హవీష్ హీరోగా ఓ సినిమాను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను మిర్చి, రన్ రాజా రన్ లాంటి చిత్రాలను నిర్మించిన సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మించనుంది. మరి ఈ సినిమాతో అయిన హవీష్ హీరోగా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement