
టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మరో చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ కావటంతో మెగా తనయుడు రామ్ చరణ్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. చిరు గత చిత్ర ఖైదీ నంబర్ 150 ఘనవిజయం సాధించటం, భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈసినిమా కావటంతో సైరాకు అదే స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. గట్టి పోటి మధ్య సాహో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సైరా ఏపీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ సాహో ఆగస్టు 15న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment