'విశ్వంభర' వీడియోకి సూపర్ రెస్పాన్స్.. దీన్ని డిజైన్ చేసిందెవరో తెలుసా? | Chiranjeevi Viswambhara Movie Concept Video Creator Details | Sakshi
Sakshi News home page

Chiranjeevi Viswambhara: చిరు 'విశ్వంభర' కాన్సెప్ట్ వీడియో తయారు చేసింది ఇతడే

Published Tue, Jan 16 2024 7:53 PM | Last Updated on Tue, Jan 16 2024 8:10 PM

Chiranjeevi Viswambhara Movie Concept Video Creator Details - Sakshi

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీకి 'విశ్వంభర' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సంక్రాంతి సందర్భంగా కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేయగా.. దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. టైటిల్ దగ్గర నుంచి విజువల్స్ వరకు అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు. అలానే వీడియోలోని గ్రాఫిక్స్, కాన్సెప్ట్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతలా క్రేజ్ తెచ్చుకున్న ఈ వీడియోని ఎవరు డిజైన్ చేశారో తెలుసా?

(ఇదీ చదవండి: గాయపడ్డ టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్.. ఇంతకీ ఏమైంది?)

'విశ్వంభర' టైటిల్ కాన్సెప్ట్ వీడియోరి డిజైన్ చేసింది అనిల్ కుమార్ ఉపాధ్యాయుల. అసోసియేట్ డైరెక్టర్‌గా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో పలు సినిమాలకు పనిచేశాడు. ప్రభాస్ 'సాహో'తో పాటు 'రాధేశ్యామ్'కి కూడా అనిల్ పనిచేశారు. రాధేశ్యామ్ సినిమాలోని నీ రాతలే పాటకు కాన్సెప్ట్ డిజైన్ చేసి పిక్చరైజ్ అనిల్ చేశాడు.

అఖిల్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తీయబోతున్నారు. ఈ ప్రాజెక్టుతో అనిల్.. దర్శకుడు కాబోతున్నాడు. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాబోతోంది. 'విశ్వంభర' కాన్సెప్ట్ వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించిన అనిల్.. మరి దర్శకుడిగా ఎలా ప్రూవ్ చేసుకుంటాడో చూడాలి?

(ఇదీ చదవండి: చిరంజీవి కొత్త సినిమా టైటిల్ 'విశ్వంభర'.. ఇంతకీ దీని అర్థమేంటి?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement