RC 16: Ram Charan Next Project With Gautham Tinnanuri In UV Creations - Sakshi
Sakshi News home page

Ram Charan New Project(RC 16): యూవీ క్రియేషన్స్‌లో.. ఆ దర్శకుడితో చెర్రి నెక్ట్‌ మూవీ

Published Fri, Oct 15 2021 12:09 PM | Last Updated on Fri, Oct 15 2021 1:12 PM

RC 16: Ram Charan Next Project With Gautham Tinnanuri In UV Creations - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ, కొరటాల డైరెక్షన్‌లో ‘ఆచార్య’  షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్‌ పూర్తయిన వెంటనే చెర్రి శంకర్‌ సినిమాను ప్రారంభించాడు. ఇలా చెర్రి తన సినిమాల విషయంలో మరింత దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఇంకా ‘ఆర్‌ఆర్‌ఆర్‌, ఆచార్య’ చిత్రాలు విడుదల కాలేదు, శంకర్‌తో సినిమా పూజా కార్యక్రమాలు మాత్రమే జరుపుకుంది.. అప్పుడే తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు చెర్రి. దసరా సందర్భంగా తన నెక్ట్‌ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.

చదవండి: భీమ్లా నాయక్‌ సెకండ్‌ సింగిల్‌, ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కబోయే ఈ చిత్రానికి ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నాడు. ఈ విషయాన్ని చెర్రి తన ట్విటర్‌ వెల్లడిస్తూ.. ‘ఈ కాంబినేషన్‌ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నాడు. అలాగే యూవీ క్రియేషన్స్‌ కూడా తమ అధికారిక ట్విటర్‌ పేజీ ఈ ప్రాజెక్ట్‌పై ప్రకటన ఇచ్చింది. మరోవైపు గౌతమ్‌ సైతం.. చెర్రీతో కలిసి పనిచేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. ‘జెర్సీ’ మూవీ సమయంలో గౌతమ్‌ పనితనాన్ని ప్రశంసిస్తూ చరణ్‌ దంపతులు ఓ లేఖ రాశారు. తాజాగా ఆ లేఖను గౌతమ్‌ షేర్‌ చేస్తూ.. ‘ఎంతోకాలంగా ఈ లేఖను దాచిపెట్టుకున్నాను. చరణ్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చినప్పుడు దీన్ని బయట ప్రపంచానికి చూపించాలనుకున్నా. ఇంత త్వరగా ఈ అవకాశం వస్తుందని అనుకోలేదు. లవ్‌ యూ చరణ్‌ సర్‌’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. 

చదవండి: ఆసుపత్రి నుంచి సాయి ధరమ్‌ తేజ్‌ డిశ్చార్జ్‌, ఆనందంలో మెగా ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement