సాక్షి, హైదరాబాద్: చిన్న పార్కింగ్ విషయం ఇద్దరు వ్యక్తులు కొట్టుకొని హాస్పటల్ పాలయ్యేలా చేసింది. హైదరాబాద్‌లోని మొయినబాగ్‌లో పార్కింగ్ విషయంలో ఇద్దరు ఇరుగు పొరుగు వారి మధ్య అర్ధరాత్రి సమయంలో గొడవజరిగింది. ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలి వానలా మారి కొట్టుకొని గాయాలపాలయ్యి ఆసుపత్రిలో చేరాలా చేసింది. భవని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. దీనిపై సంతోష్ నగర్ డివిజన్ ఏసీపీ శివరామ్ శర్మ మాట్లాడుతూ...‘ గొడవ తరువాత ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉంటున్న వారందరూ గొడవ చూడటానికి గుమిగూడారు. ఇండియన్ పీనల్ కోడ్ కింద దీనికి సంబంధించిన కేసు నమోదు చేశాం. ఇద్దరికి గాయాలు కావడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై మరింత దర్యాప్తు చేపడతాం ’అని తెలిపారు. (వలస కార్మికుల బస్సుకు తప్పిన ప్రమాదం)
Comments
Please login to add a commentAdd a comment