
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్-అజయ్ దేవగన్ మధ్య విభేదాలు ఉన్నట్లు బాలీవుడ్ టాక్. ఓ పార్టీలో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని, అప్పటి నుంచి ఈ స్టార్ హీరోల మధ్య మాటల్లేవని వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై అజయ్ దేవగన్ మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. అసలు తమ మధ్య ఎలాంటి గొడవ జరగలేదన్నారు.
ఆయన మాట్లాడుతూ..'నేను, సల్మాన్, ఆమిర్ ఖాన్, షారుక్ ఇలా ఓ అరడజను హీరోలు ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. ఒకటీ రెండేళ్లలోనే మేమంతా స్నేహితులుగా మారిపోయాం. మా మధ్య సినిమాల విషయంలో పోటీ ఉంటుంది తప్పా వ్యక్తిగతంలో మా మధ్య గొడవలు లేవు. ఇక షారుక్‌తో విభేదాలు అన్నవి కూడా పూర్తి అబద్దం. ఇది ఎవరో సృష్టించిన పుకార్లు మాత్రమే'boll అంటూ దేవగన్ వివరించారు.
చదవండి: ఆఫ్టర్ ఎ గ్యాప్.. రీఎంట్రీకి రెడీ అయిన హీరోయిన్స్