
హీరో వరుణ్ తేజ్ – దర్శకుడు కిరణ్ కొర్రపాటి మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే ‘గని’ సినిమా ఆగిపోయిందనీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వరుణ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ‘గని’ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. కాగా కిరణ్ కొర్రపాటి సినిమా తీస్తున్న విధానం వరుణ్‌కి నచ్చలేదని, ఇదే విషయంపై ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదంపై కిరణ్ స్పందిస్తూ– ‘‘ఆ వార్తల్లో నిజం లేదు.. ఇప్పటి వరకూ వచ్చిన ‘గని’ అవుట్‌పుట్‌పై వరుణ్ తేజ్ సంతోషంగా ఉన్నారు. మా మధ్య విభేదాలంటూ వచ్చిన వార్తలను ఎవరూ నమ్మకండి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment