gani
-
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మెగా హీరో!
సౌత్ ఇండస్ట్రీకి చెందిన హీరో, హీరోయిన్లకు బాలీవుడ్ అంటె కొంచెం క్రేజ్ ఎక్కువ. అందుకే తమ ఇండస్ట్రీలో కావాల్సినంత గుర్తింపు తెచ్చుకొని, ఆ తర్వాత బాలీవుడ్‌లోకి వెళ్తుంటారు. అందుకు టాలీవుడ్ పరిశ్రమ కూడా అతీతం కాదు. మన స్టార్ హీరోల్లో చాలామంది బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. మరికొంతమంది హిందీ పరిశ్రమలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా చేరాడు. మెగా హీరోలంతా మాస్ సినిమాలు చేస్తుంటే.. వరుణ్ మాత్రం అందుకు కాస్త భిన్నంగా వెళ్తున్నాడు. ఒక జానర్‌కు పరిమితం కాకుండా అన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే తొలి ప్రేమ, ఫిదా, గద్దల కొండ గణేష్ సినిమాలతో మంచి విజయాలు సాధించాడు వరుణ్. ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం వరుణ్ బాక్సింగ్ శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత బాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటున్నాడట వరుణ్. సోనీ పిక్చర్స్ నిర్మాణ సంస్థలో వరుణ్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాను తెలుగు హిందీలో ఒకేసారి తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ మెగా హీరో.. బాలీవుడ్లో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. -
ఆ వార్తల్లో నిజం లేదు!
హీరో వరుణ్ తేజ్ – దర్శకుడు కిరణ్ కొర్రపాటి మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే ‘గని’ సినిమా ఆగిపోయిందనీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వరుణ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ‘గని’ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. కాగా కిరణ్ కొర్రపాటి సినిమా తీస్తున్న విధానం వరుణ్‌కి నచ్చలేదని, ఇదే విషయంపై ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదంపై కిరణ్ స్పందిస్తూ– ‘‘ఆ వార్తల్లో నిజం లేదు.. ఇప్పటి వరకూ వచ్చిన ‘గని’ అవుట్‌పుట్‌పై వరుణ్ తేజ్ సంతోషంగా ఉన్నారు. మా మధ్య విభేదాలంటూ వచ్చిన వార్తలను ఎవరూ నమ్మకండి’’ అన్నారు. -
వరుణ్‌తేజ్‌ను మాయ ఎందుకు ప్రేమిస్తుంది?
గని మనసును మాయ చేసింది మాయ. తన ప్రేమ రింగులో బాక్సర్ గనిని బంధించింది. ఈ మాయ, గనిల ప్రేమకథను వెండితెరపై చూడటానికి కాస్త సమయం ఉంది. వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. హీరోయిన్గా సయీ మంజ్రేకర్ నటిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాక్సర్ గని పాత్రలో వరుణ్ తేజ్, కాలేజ్ స్టూడెంట్ మాయ పాత్రలో సయీ మంజ్రేకర్ కనిపిస్తారు. ‘‘సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్ 3’లో సయీ మంజ్రేకర్ నటన చూసి ‘గని’ సినిమాకి తీసుకున్నాం. సయీకి కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. మాయ జీవితంలోకి గని ఎందుకు రావాల్సి వచ్చింది? గనిని మాయ ఏ కారణంతో ప్రేమిస్తుంది? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. తెలుగు డైలాగ్స్‌ని సయీ బాగా పలుకుతోంది. షూటింగ్‌కు ఒక రోజు ముందే ఆమెకు డైలాగ్స్ ఇస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని జూలై 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ప్రపంచ దేశాలకే ఆదర్శం
- శకునాల- గని మధ్య సోలార్ పార్కు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ - నిర్మాణ పనుల పరిశీలన - జూన్ నెలలో ప్రారంభానికి సన్నాహాలు ఓర్వకల్లు : పెరిగిపోతున్న ఇంధన అవసరాలను అధిగమించే దిశగా గడివేముల మండలం శకునాల-గని గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న సోలార్ పవర్ పార్కు ప్రపంచ దేశాలకే ఆదర్శంగా మారుతుందని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ అన్నారు. అజయ్‌జైన్‌తో పాటు జేసీ హరికిరణ్, ఆర్డీఓ హుసేన్ సాహెబ్, సోలార్ ప్రాజెక్టు ఎండీ ఆదిశేషు, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి శుక్రవారం ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా అజయ్‌జైన్ మాట్లాడుతూ 1000 మెగా వాట్ల సామర్థ్యం కల్గిన పార్కుకు సంబంధించి ఇప్పటివరకు 900 మెగా వాట్ల పనులు పూర్తయినట్లు తెలిపారు. మిగతా 100 మెగావాట్ల పనులను మే నెలాఖరుకు పూర్తి చేయాలని ఎండీ ఆదిశేషుకు సూచించారు. జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం ఇటీవలే మరో 300 మెగా వాట్ల విద్యుదుత్పత్తి కోసం సేకరించిన భూములను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనాథ్, ఎస్ఐ చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన... : సోలార్ బాధిత రైతులకు పరిహారం చెల్లించే వరకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అంగీకరించేంది లేదని పేర్కొంటూ సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. పార్టీ డివిజన్ కార్యదర్శి రామకృష్ణ, మండల నాయకులు నాగన్న, చంద్రబాబు, రామన్న తదితరులు ప్రాజెక్టు వద్దకు వెళ్లి బాధితులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. తర్వాత అజయ్‌జైన్‌కు వినతిపత్రం అందించారు. -
మార్చి ఆఖరుకు సోలార్ పార్క్ సిద్ధం
- జిల్లా కలెక్టర్ విజయమోహన్ గడివేముల: అల్ట్రామెగా సోలార్ పార్క్‌ను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. గని గ్రామ పొలిమేరలో నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..వెయ్యి మెగా వాట్ల సామర్థ్యం గల సోలార్ పార్కు ఎక్కడా లేదని, కర్నూలు జిల్లాలో ఏర్పాటు కావడం గర్వకారణమన్నారు. ఇందులో 500 మెగా వాట్ల పనులను గ్రీన్‌కవర్, 350మెగావాట్ల పనులను సాఫ్ట్‌బ్యాంకు, వంద మెగా వాట్ల పనులను హజాద్, 50 మెగా వాట్ల పనులను అదాని కంపెనీ చేపడుతోందన్నారు. ఏప్రిల్‌లో సోలార్ పార్క్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. ఇందులో కార్మికులు.. 500 నుంచి 600మంది అవసరం అవుతారని, టెక్నికల్ అధికారుల ద్వారా ఏ విషయం తెలియజేస్తామన్నారు. సోలార్ పార్క్ ఏర్పాటు కోసం గని, శకునాల గ్రామాల్లో 5,500 ఎకరాల భూములను తీసుకున్నామన్నారు. అసైన్డ్ భూములు కోల్పోయిన రైతులు పరిహారం కోసం ఆర్డీఓకు అప్పీలు చేసుకోవచ్చన్నారు.సోలార్ పార్కు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రాజెక్టును సందర్శించే పర్యాటకులకు అవసరమైన వసతులు కలిపిస్తామన్నారు. కార్యక్రమంలో సోలార్ ఎండీ ఆదిశేషు, వివిధ కంపెనీల ప్రతినిధులు మోహన్ జతన్, సన్డ్రాజా, నెడ్‌క్యాప్ ఎస్ఈ నారాయణమూర్తి, ఈఈ సుధాకర్, నంద్యాల ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ రామసుబ్బయ్య పాల్గొన్నారు.