
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఓ జర్నలిస్ట్‌పై సీరియస్ అయ్యారు. జైట్లీ ఓ సెమినార్‌లో బుల్లెట్ రైలు గురించి ప్రసంగిస్తున్నారు.
జైట్లీ సీరియస్‌గా ప్రసంగిస్తున్న సమయంలో ఆయన్ని ఓ జర్నలిస్టు హిందీలో బుల్లెట్ ట్రైన్‌ను ఏమంటారని అడిగారు. దీనికి ఆగ్రహించిన జైట్లీ కొంతసేపు అయినా సీరియస్‌గా ఉండండి ఇలా మధ్యలో అడ్డు రావడం మంచిది కాదంటూ అతనిని మందలించారు.