న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత కలుషిత నగరాల జాబితా విడుదలైంది. దీనిప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 30 నగరాలు అత్యంత కలుషితమైనవిగా గుర్తించారు. దీనిలో 22 నగరాలు భారత్‌లోనే ఉండటం గమనార్హం. కాగా, స్విస్ అనే సంస్థ వరల్డ్ ఎయిర్ క్వాలీటీ ఇండెక్స్ రిపోర్ట్ - 2020ను విడుదలచేసింది. ఈ నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా చైనాలోని జిన్జియాంగ్ తొలి స్థానంలో నిలిచింది. కాగా, దీని తర్వాత మిగతా 9 నగరాలు మనదేశానికి చెందినవే. ఇక..రెండో స్థానంలో ఘజియాబాద్, మూడో స్థానంలో బులంద్‌షహర్ ఉంది. ఈ ర్యాంకింగ్స్‌లో ఢిల్లీ పదవ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కలుషిత రాజధాని నగరాలలో ఢిల్లీ తొలిస్థానంలో నిలిచింది. వీటి తర్వాత బిస్రఖ్ జలాల్‌పూర్, నోయిడా, గ్రేటర్ నోయిడా, కాన్పూర్, లక్నో, మీరట్, ఆగ్రా మరియు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్, రాజస్థాన్‌లోని భీవారీ, జింద్ , హిసార్, ఫతేహాబాద్, బాంధ్వరి, గురుగ్రామ్, యమునా నగర్, హర్యానాలోని రోహ్తక్ మరియు ధారుహేరా, మరియు బీహార్‌లోని ముజఫర్‌పూర్ లు నిలిచాయి.
అయితే కరోనా నేపథ్యంలో ఢిల్లీలో 2019 నుంచి 2020ల మధ్య వాయునాణ్యత 15 శాతంమెరుగుపడింది. ఈ రిపోర్ట్ 106 దేశాల నుంచి వచ్చిన పీయమ్ 2.5 డేటా ఆధారంగా తీసుకున్నారు. వీటిని ప్రభుత్వరంగ సంస్థలు నిర్వహిస్తాయి. భారత్‌లో ప్రధానంగా వంటచెరకు, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, వ్యర్థాల దహనం, వాహనాల నుంచి వచ్చేపోగ కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయి. అయితే..దీనిపై గ్రీన్ ఇండియా క్యాంపెయినర్ అవినాష చంచల్ మాట్లాడుతూ..లాక్‌డౌన్ కాలంలో వాయునాణ్యత స్వల్పంగా పెరిగిందని అన్నారు. కాగా, ప్రభుత్వాలు ఎలక్టిక్ వాహనాలను , సైక్లింగ్, వాకింగ్, ప్రజారవాణాను ప్రొత్సహించాలని అన్నారు. అయితే, పరిశుభ్రమైన గాలిని పీల్చడంతో, ఆరోగ్యసమస్యలు దూరమవుతాయని చంచల్ అన్నారు. ప్రజలు పర్యావరణాన్ని, కాపాడుకొంటు, కాలుష్యాన్ని తగ్గించుకొవాల్సిన అవసరం ఉందని ఐక్యూ ఎయిర్సీఈవో ఫ్రాంక్ హమ్స్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment