రూ లక్ష బాకీ తీర్చలేదని స్నేహితుడిని.. | Man Beats Up Friend Leaves Him In Car To Die | Sakshi
Sakshi News home page

రూ లక్ష బాకీ తీర్చలేదని స్నేహితుడిని..

Published Fri, Jun 14 2019 6:51 PM | Last Updated on Fri, Jun 14 2019 6:51 PM

Man Beats Up Friend Leaves Him In Car To Die - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : రూ లక్ష అప్పుతీసుకుని తిరిగి చెల్లించలేదన్న కోపంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తన స్నేహితుడిని కొట్టిచంపిన ఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది. ఢిల్లీలోని ఎర్రకోట వెనుక రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన అనంతరం ఈ ఘటన వెలుగుచూసింది . బాధితుడి షర్ట్‌ వెనక ఉన్న స్టిక్కర్‌ను చూసిన పోలీసులు అతడిని బులంద్‌షహర్‌ నివాసిగా గుర్తించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈశాన్య ఢిల్లీకి చెందిన నిందితుడు అజయ్‌ సింగ్‌ రాఘవ్‌ పీతంపురాలోని ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తుంటాడు. నిందితుడు సింగ్‌ తన స్నేహితుడికి రూ లక్ష అప్పుగా ఇచ్చాడు. తిరిగి చెల్లించడంలో విఫలమవడంతో బాధితుడిని సింగ్‌ దారుణంగా కొట్టి తన కారులో నిర్భందించి ఊపిరాడకుండా చేసి మరణించిన తర్వాత ఎర్రకోట వెనకాల పడేశాడు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారని ఢిల్లీ ఏసీపీ (నార్త్‌) హరీంద్ర సింగ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement