సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేను బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలుస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేతో పాటు మరో ముగ్గురు అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతం, సీఎంల్ డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్‌లను కూడా దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది. 1999లో ఝార్ఖండ్‌లోని గిరిధిలో ఉన్న బ్రహ్మదిహ బొగ్గు గనులను కాస్ట్రాన్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు కేటాయించగా, ఇందులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
దీంతో దీనిపై విచారణకు ఆదేశించారు. దశాబ్ధాలుగా ఈ విషయంపై విచారణ కొనసాగింది. ఈ కేటాయింపుల్లో దిలీప్ రేతో పాటు మరో ముగ్గురు అవినీతికి పాల్పడినట్లు ప్రత్యేక కోర్టు గుర్తించింది. మాజీ ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వ హయంలో దిలీప్ రే ఉక్కు, బొగ్గుశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నెల 14న దిలీప్ రేతో పాటు దోషిగా తేలిన మరో ముగ్గురుకు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment