న్యూఢిల్లీ: దేశమంతా ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ ధాటికి గజగడలాడుతుంటే థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. సింగపూర్ లో విజృంబిస్తున్న కొవిడ్-19 కొత్త వేరియంట్ భారతదేశం థర్ఢ్ వేవ్ కు కారణం కావచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. సింగపూర్ లో చిన్నారుల్లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు.
సింగపూర్ లో కొవిడ్-19 కొత్త వేరియంట్‌ను కనిపెట్టారని అది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ వైరస్ పిల్లలకు చాలా ప్రమాదకరమని, సింగపూర్‌తో విమాన సేవలను తక్షణమే నిలిపివేయాలని, పిల్లల టీకా డ్రైవ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. ఢిల్లీలో కరోనా కేసులు పదివేలు లోపు నమోదు కావడం కొంత ఊరట కలిగి ఇస్తుంది.
(చదవండి:సహజీవనం నైతికంగా ఆమోదయోగ్యం కాదు: హైకోర్టు)
Comments
Please login to add a commentAdd a comment