జీవితకాలం మరో పదేళ్లు పెరగాలంటే...
జీవితకాలం మరో పదేళ్లు పెరగాలంటే...
Published Tue, Sep 12 2017 3:02 PM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM
సాక్షి, న్యూఢిల్లీః ఆరోగ్యకర జీవనానికి పరిసరాల ప్రభావం అత్యంత కీలకమని మరో అథ్యయనం తేల్చింది.కాలుష్య కోరల్లో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ రాజధాని పౌరులు ఆరోగ్యకర జీవనం కోసం శుభ్రమైన గాలిని పీల్చాల్సిందేనని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారిస్తే నగర వాసుల జీవిత కాలం మరో తొమ్మిదేళ్లు పెరుగుతుందని తాజా అథ్యయనం తేల్చింది. దేశవ్యాప్తంగా వాయు కాలుష్యాన్ని డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల ప్రకారం నియంత్రిస్తే భారతీయుల జీవన కాలం మరో నాలుగేళ్లు పెరుగుతుందని చికాగో వర్సిటీకి చెందిన ఎనర్జీ పాలిసీ ఇనిస్టిట్యూట్ రూపొందించిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ఈ వివరాలు వెల్లడించింది.
ఢిల్లీ గాలిలో పర్టిక్యులేట్ మ్యాటర్ పొల్యూషన్, పీఎం 2.5గా నమోదైంది. 2.5 మైక్రాన్ల కన్నా తక్కువ ఉంటే అది మానవుల శ్వాసకోశ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లచేస్తుంది. జాతీయ సగటు స్ధాయిలో ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించినా దేశ రాజధాని వాసుల జీవితకాలం మరో ఆరేళ్లు పెరుగుతుందని ఈ అథ్యయనం పేర్కొంది.ప్రపంచంలో అత్యంత కాలుష్యకారక నగరాల జాబితాలో ఢిల్లీ ముందువరుసలో ఉంది.
Advertisement