
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత 20 కాలుష్య నగరాల్లో 15 నగరాలు భారత్‌వే కావడం ఆందోళన రేకెత్తిస్తోంది.పర్యావరణ ఎన్జీవో గ్రీన్‌పీస్ చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2018లో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ పొరుగున ఉన్న గురుగ్రామ్, ఘజియాబాద్‌లు ముందువరసలో నిలవగా, దేశ రాజధాని ఢిల్లీ 11వ స్ధానంలో నిలిచింది.
ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం కలిగిన దేశ రాజధానుల్లో ఢిల్లీ ఈ జాబితాలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఇక 20 అత్యంత కాలుష్య నగరాల్లో మిగిలిన ఐదు నగరాలు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో విస్తరించిఉన్నాయి. దశాబ్ధకాలంగా కాలుష్యంతో సతమతమవుతున్న చైనా కాలుష్యాన్ని అధిగమించేందుకు చేపట్టిన చర్యల్లో కొంత మేర సఫలీకృతమైంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో చైనా రాజధాని బీజింగ్ 122వ స్ధానంలో నిలిచి కాలుష్య నియంత్రణలో కొంతమేర విజయం సాధించింది.
ఇక ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పీఎం 2.5 కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వాహన రాకపోకలు, పంట వ్యర్ధాల దగ్ధం వంటివి పరిస్థితి చేజారేందుకు దోహదపడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారత నగరాలు వరుసగా గురుగ్రాం, ఘజియాబాద్ తొలి రెడు స్ధానాల్లో నిలవగదా ఫరీదాబాద్, భివాడి, నోయిడా, పట్నా, లక్నో, ఢిల్లీ, జోధ్‌పూర్, ముజఫర్‌పూర్, వారణాసి, మొరదాబాద్, ఆగ్రా, గయ, జింద్ నగరాలు టాప్ 20 జాబితాలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment