న్యూఢిల్లీ: గాలి కాలుష్యం తీవ్రత, అది కొనసాగిన రోజుల పరంగా చూస్తే కొన్ని పట్టణాలు ఢిల్లీ కన్నా ఎక్కువగా కాలుష్యం బారిన పడినట్లు ఓ అధ్యయనంలో తేలింది. గురుగ్రామ్, లక్నో, ఫరీదాబాద్‌లలో గాలి కాలుష్యం ఢిల్లీ కన్నా ఎక్కువ రోజులు నమోదైనట్లు వెల్లడైంది. షికాగో వర్సిటీలోని ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్(ఈపీఐసీ–ఇండియా) 2016 నవంబర్–2017 అక్టోబర్ మధ్య కాలానికి ఈ అధ్యయనం చేపట్టింది.
నివేదిక వివరాల ప్రకారం.. ప్రధాన కాలుష్య కారకం పీఎం 2.5 సాంద్రత గురుగ్రామ్, కాన్పూర్, లక్నో, ఫరీదాబాద్‌లలో ఎక్కువగా ఉంది. పైన పేర్కొన్న కాలంలో ఢిల్లీలో కలుషిత గాలి 146 రోజులుండగా, గురుగ్రామ్‌లో 190 రోజులు, లక్నోలో 167 రోజులు, ఫరీదాబాద్‌లో 147 రోజులు ఉంది. కాన్పూర్‌లో గరిష్టంగా 64 రోజులు అత్యంత కలుషిత గాలి వీచింది. గయలో 42 రోజులు, పట్నాలో 37 రోజులు, ఆగ్రాలో 37 రోజులు అత్యంత కలుషిత గాలి కొనసాగింది. వార్షిక పీఎం 2.5 సాంద్రత ఢిల్లీలో 130 పాయింట్లు, ఫరీదాబాద్‌లో 170 పాయింట్లు, కాన్పూర్‌లో 166 పాయింట్లు, గురుగ్రామ్‌లో 163 పాయింట్లు, లక్నోలో 143 పాయింట్లు్లగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment