
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అటు ఆప్, ఇటు బీజేపీలకు ప్రతిష్ఠాత్మకంగా పరిణమించాయి. రెండు పార్టీలూ ఉచిత పథకా లను వాగ్దానం చేయడంలో పోటీపడుతున్నాయి. కాని, కాలు ష్యంతో కునారిల్లుతున్న రాజధాని ఢిల్లీ పరిస్థితిని బాగు చెయ్యడంపై ఎటువంటి హామీలూ ఇవ్వకపోవడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నట్లు మరో మూడేళ్లలో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా అభివృద్ధి చెందినా ఇటువంటి రాజధాని నగరంతో అంతర్జాతీయ యవనికపై భారత్ సగర్వంగా నిలబడలేదు. ఒక వంక మురికి కాలువగా మారిపోయిన యమునా నది, ఇంకోవైపు ఎటుచూసినా కనిపించే వ్యర్థపదార్థాలు వంటి ఎన్నో కారణాల వల్ల ఢిల్లీ కాలుష్యం రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత, వైఫల్యాలను ఈ స్థితి తెలుపుతోంది.
అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి ప్రజాజీవనం ప్రారంభించిన కేజ్రీవాల్ స్వయంగా అవినీతి కేసులో జైలుకు వెళ్లిరావడం, ఆయన సహచరులూ అనేకమంది జైలుపాలు కావడం వల్ల ఆప్ ఆత్మరక్షణలో పడింది. తమ నాయకులపై పెట్టిన కేసులన్నీ రాజకీయ కక్షసాధింపుతో నమోదు చేసినవి అని చెబుతున్నా, ఆ కేసులు న్యాయస్థానాల ముందు నిలబడే అవకాశాలు ఉన్నా, లేకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకనే తన రాజకీయ జీవనంలో పెనుసవాల్‌ను కేజ్రీవాల్ ఎదుర్కొంటున్నారు.
2014 నుండి వరుసగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 7 లోక్ సభ సీట్లనూ గెల్చుకుంటున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి పరాజయం తప్పడం లేదు. మీడియాలో సంచలనాలు సృష్టించే నాయకులపై ఆధారపడుతోంది కానీ ఇతర పార్టీల మాదిరిగా క్షేత్రస్థాయిలో జనం మధ్యలో పని చేసే నాయకులను ప్రోత్సహించడం లేదు. దానితో బీజేపీకి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో సైతం పరాజయం తప్పలేదు.
‘శీష్ మహల్’ గురించి కొంతమేరకు కేజ్రీవాల్‌ను ఇరకాటంలో పడవేసిన బంగారు పూత పూసిన టాయిలెట్ ఫిట్టింగ్‌లు, స్విమ్మింగ్ పూల్ వంటి ప్రచారాలు అవాస్తవమని వెల్లడి కావ డంతో వెంటనే బీజేపీ తమ ప్రచారాన్ని మార్చి వేసింది. ‘ఒక్కసారి అధికారం ఇస్తే ఢిల్లీ రూపురేఖలను మార్చగలం’ అని ఇప్పుడు చెబున్నారు. ఢిల్లీ తీవ్ర మైన నీటి సమస్య ఎదుర్కొంటున్న సమయంలో పొరుగున ఉన్న హరి యాణాలోని బీజేపీ ప్రభుత్వం సహ కరించే విధంగా కేంద్రం ఎటువంటి చొరవ తీసుకోలేక పోయింది.
వాస్తవానికి కేజ్రీవాల్‌తో సమా నంగా ప్రజాదరణ గల నాయకులు ఎవ్వరూ ఢిల్లీ బీజేపీలో లేరు. అందుకనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు ఆ పార్టీ వెనకాడుతోంది. కేవలం ప్రధాని మోదీ ప్రజాకర్షణపైననే ఆధారపడుతోంది. ఆప్ ఈ ఎన్నికలలో గెలుపొందితే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ వంటి వారు కలిసి బలమైన ప్రత్యా మ్నాయం అందించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజల జీవన్మరణ సమస్య అయిన కాలు ష్యాన్ని వదిలేసి ఆప్, బీజేపీలు ఉచిత పథకాలపై హామీలు గుప్పించి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్నాయి.
– సభావట్ కళ్యాణ్
లా విద్యార్థి, ఢిల్లీ యూనివర్సిటీ ‘ 90143 22572
Comments
Please login to add a commentAdd a comment