
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధికార నివాసంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని 7 లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని నివాసంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్ధలానికి తొమ్మిది అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఘటనా ప్రాంతానికి హుటాహుటిన అంబులెన్స్‌లు చేరుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.కాగా, ప్రధాని అధికారిక నివాసంలో ఎలాంటి అగ్నిప్రమాదం జరగలేదని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎల్‌కేఎం కాంప్లెక్స్‌లోని ఎస్‌పీజీ రిసెప్షన్ ప్రాంతంలో స్పల్వ అగ్నిప్రమాదం చోటుచేసుకుందని మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపింది.