
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేయడంతో రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం నెలకొంది. మంచు కప్పేయడంతో రహదారి కనిపించక ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో కాలవలో కారు పడిపోవడంతో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మరణించారు. మంచు ప్రభావంతో ఐదు విమానాలు రద్దవగా, 500 విమానాల రాకపోకల్లో జాప్యం నెలకొంది. ఢిల్లీ మీదుగా రావాల్సిన 21 విమానాలను దారిమళ్లించారు. ఇక దాదాపు 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు దేశరాజధానిలో వాయు కాలుష్యం ప్రమాదకరస్ధాయికి చేరుకుంది. మంచు కారణంగా రహదారులు కనిపించక మెయిన్ రోడ్లపై వాహనాలు నిదానంగా కదులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment