మీరు బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఒక్కరోజులో పుత్తడి ధర భారీగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగిరావడంతో ఆ ప్రభావం దేశీయ గోల్డ్ ధరల మీద కూడా పడింది. దీంతో బంగారం రేటు పడిపోయింది. అలాగే, బంగారం ధర బాటలోనే వెండి కూడా పయనించింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో 10 గ్రాముల 24 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధరపై రూ.911లు తగ్గడంతో రూ.47,611కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో ఈ ధర రూ.48,529గా ముగిసింది. ఇక ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.841 తగ్గడంతో రూ.43,612కి చేరుకుంది.
గతంలో ఇంత మొత్తం మేర తగ్గిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే, ఇక హైదరాబాద్‌లో కూడా గోల్డ్ ధర దిగొచ్చింది. నేడు (జూన్ 17) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 క్షిణించి రూ.49,470కు తగ్గింది. 22 క్యారెట్ల 122 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 క్షిణించి రూ.45,350కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో, 2023లో వడ్డీ రేటు పెంపు జరగవచ్చని యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అధికారులు సూచించారు. దీంతో బుధవారం పుత్తడి ధర ఒకశాతం తగ్గింది. తాజాగా 2.31 శాతం ధర పడిపోవడంతో ఔన్స్ పసిడి ధర 1,821 డాలర్లు పలుకుతోంది. మరోవైపు, వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనించాయి. కిలో వెండిపై రూ.1,311లు తగ్గడంతో 70,079గా ట్రేడ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment