బంగారం కొనుగోలు చేయాలని మీరు ఆలోచిస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. బంగారం ధర పరుగులు పెడుతూనే ఉంది. నేడు బంగారం ధర భారీగా పెరిగింది. పసిడి ధర పెరగడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. పసిడి బాటలోనే వెండి రేటు కూడా పయనించింది. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,975 నుంచి రూ.49,422కు పెరగింది. ఇక, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,861 నుంచి రూ.45,271కు చేరుకుంది.
ఇక హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర నేటి ఉదయం 10 గ్రాములు రూ.45,900 నుంచి రూ.46,100కు పెరిగింది. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు బంగారం ధర రూ.230 పెరిగి రూ.50,070 నుంచి రూ.50,300కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ ఏర్పడటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలోపై రూ.1,058 పెరగడం ద్వారా రూ.72,428కు చేరుకుంది.
చదవండి: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్!
Comments
Please login to add a commentAdd a comment