Gold Price Today 6 July 2021: Gold And Silver Prices Hiked Again - Sakshi
Sakshi News home page

బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్!

Published Tue, Jul 6 2021 5:09 PM | Last Updated on Wed, Jul 7 2021 1:42 PM

Gold Price Today 6 July 2021: Gold and Silver prices Hiked Again - Sakshi

న్యూఢిల్లీ: బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్!. కేవలం ఆరు రోజుల్లో బంగారం ధర 1,000 రూపాయలకు పైగా పెరగింది. నేడు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా భారతదేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దాదాపు మూడు వారాల గరిష్టాన్ని తాకాయి. స్పాట్ బంగారం 0.4% పెరిగి ఔన్స్ కు 1,798.46 డాలర్ల వద్ద ఉంది. జూన్ 17 తర్వాత ఇదే అత్యధికం. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ కు 0.8% పెరిగి 1,798.10 డాలర్లకు చేరుకున్నట్లు రాయిటర్స్ తెలిపింది. 

న్యూఢిల్లీ బులియన్ జువెలరీ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.47,425 నుంచి రూ.47,758 పైకి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులో రూ.305 పెరిగి రూ.43,441 చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,310 నుంచి రూ.44,400కి పెరిగితే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,340 నుంచి రూ.48,440కు పెరగింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు కేజీ వెండి ధర రూ.115 పెరిగి కిలో రూ.69,910కు చేరింది. అంతకుముందు కిలో రూ.69,795గా ఉన్న సంగతి తెలిసిందే.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement