
న్యూఢిల్లీ: కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్టాల సీఎంలతో వీడియో కాన్సరేన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ కట్టడికి మరిన్నిచర్యలు అవసరమన్నారు. గడచిన కొన్నిరోజులుగా కేసులు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో దీని తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. ఆయా రాష్ట్రాలు అవసరమైతే లాక్‌డౌన్ విధించి కరోనా తీవ్రతను అదుపుచేయాలని కోరారు. దీని కట్టడి కోసం మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
రోజుకు దాదాపు 30 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నామని తెలిపారు. కరోనాపై ప్రభుత్వాలు ఏమాత్రం నిర్లక్క్ష్యం చేయోద్దని అన్నారు. దీనిపై యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకొవాలన్నారు. ప్రతిచోట ట్రేసింగ్ నిర్వహించాలని తెలిపారు. ఆయా రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలందరూ మాస్క్‌ను విధిగా ధరించడం,సామాజిక దూరం, శానిటైజేషన్ వంటివి ఖచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. కోవిడ్ టెస్టుల సంఖ్యలను పెంచాలని కోరారు. ఆర్‌టీపీసీఆర్‌ల టెస్టులను పెంచాలని అన్నారు. గడచిన 24 గంటలలో మహరాష్ట్రలో 17,864 కేసులు, కేరళ లో 1,970..పంజాబ్‌లో 1,463 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment