
పార్లమెంట్‌లో తిరుపతి లడ్డూల పంపిణీ
ఇటీవలి ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని బీజేపీ.. తిరుపతి ప్రసాదం లడ్డూలను పార్లమెంట్‌లో సభ్యులకు పంపిణీ చేసి అందరితో పంచుకుంది.
వాటిని వెంటనే రాజధానికి తరలించిన బీజేపీ శ్రేణులు.. గురువారం ఉదయం పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యులకు పంపిణీ చేశారు. తిరుపతి లడ్డూలకు ఎంతో పేరున్న విషయం విదితమే. ముందుగా ఈ లడ్డూలను బీజేపీ పార్లమంటరీ పార్టీ సమావేశంలో అందజేయాలనుకున్నామని, చివరి నిమిషంలో ఓ నాయకుడు ఇచ్చిన సూచన మేరకు ఆ నిర్ణయం మార్చుకున్నామని వివరించారు.