ప్రత్యేక హోదా బిల్లుకు మద్దతివ్వండి : కడియాల | Support the special status of the bill: kdiyala | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా బిల్లుకు మద్దతివ్వండి : కడియాల

Published Fri, May 13 2016 2:24 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

ప్రత్యేక హోదా బిల్లుకు మద్దతివ్వండి : కడియాల - Sakshi

ప్రత్యేక హోదా బిల్లుకు మద్దతివ్వండి : కడియాల

మచిలీపట్నం(కోనేరుసెంటర్) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్‌లో కాంగ్రెస్ నాయకులు ప్రవేశపెట్టనున్న ప్రైవేటు బిల్లుకు టీడీపీ, బీజేపీ నాయకులు మద్దతు పలకాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు కోరారు. పీసీసీ పిలుపు మేరకు గురువారం రాత్రి కాంగ్రెస్ నాయకులు స్థానిక కోనేరుసెంటర్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బుచ్చిబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ప్రైవేటు బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలియజేయాలన్నారు. తద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించుకోవాలని కోరారు.

ఈ విషయంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటాలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బందరు, అవనిగడ్డ, పెడన ఇన్‌ఛార్జిలు రాధికామాధవి, మల్లి వెంకటేశ్వరరావు, ఎస్.రాజు, పట్టణ అధ్యక్షుడు అబ్దుల్‌మతీన్, పీసీసీ కార్యదర్శులు విశ్వేశ్వరరావు, గుమ్మడి విద్యాసాగర్, మైనార్టీ నాయకులు ఇషాక్, కె.చంద్రశేఖర్, పి.నాగరాజు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement