న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభ సభ్యులుగా పోటీ లేకుండా ఎన్నికయ్యారు. సంజయ్ సింగ్, సుశీల్ గుప్తా, ఎన్.డి.గుప్తాలు సోమవారం రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరికి ఎన్నికల కమిషన్ తరపున రిటర్నింగ్ అధికారి నిధి శ్రీవాత్సవ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.