సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ప్రమాదస్ధాయిని మించి ప్రవహిస్తుండటంతో లోహ పులిగా పేరొందిన పాత ఇనుప బ్రిడ్జిపై వాహన రాకపోకలను సోమవారం మధ్యాహ్నం నుంచి నిలిపివేశారు. యమున నదిలో ప్రమాదస్ధాయి 205.33 మీటర్లు కాగా నది ప్రవాహం 205.20 మీటర్లకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
యమున నది ప్రవాహం మరింత పెరుగుతుందనే అంచనాలతో పురాతన ఇనుప వంతెనను మూసివేయాలని జిల్లా మేజిస్ర్టేట్ ఉత్తర్వులు జారీ చేశారని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్ నుంచి వరద నీటిని విడుదల చేసిన తర్వాత యమునా నదికి వరద ప్రవాహం పోటెత్తింది. మరోవైపు వరద తీవ్రతతో ఢిల్లీలో చేపట్టాల్సిన చర్యలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment