ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో జైలుకు పంపారనే కోపంతో స్ధానికులు, పోలీసులకు బుద్ధి చెప్పాలని పార్క్ చేసిన వాహనాలను దగ్ధం చేసిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రోహణి ప్రాంతంలోని ఖంజవాలా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈనెల 23 రాత్రి పార్క్ చేసిన వాహనాలను దగ్ధం చేసిన ఘటనలు వరసగా మూడు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో 12కు పైగా కార్లు, రెండు ద్విచక్రవాహనాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారని పోలీసులు చెప్పారు. మూడు వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆకాష్ (19), కుల్దీప్(30)లు ఈ నేరానికి పాల్పడినట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. నిందితులు ఇద్దరూ నేరాన్ని అంగీకరించారని చెప్పారు. కాగా మద్యానికి బానిసైన ఆకాష్‌ను గతంలో ఓ బాధితురాలి ఫిర్యాదుపై జైలుకు తరలించారు. జైలు నుంచి తిరిగివచ్చిన అనంతరం తనను జైలుకు పంపిన స్ధానికులపై కుల్దీప్‌తో కలిసి పగ తీర్చుకోవాలని పథకం ప్రకారం కాలనీల్లో పార్క్ చేసిన వాహనాలను దగ్థం చేయాలని నిర్ణయించుకున్నాడు. తమ పథకంలో భాగంగా సెప్టెంబర్ 23 రాత్రి జేజే కాలనీలో మూడు కార్లు, ఒక బైక్‌కు నిప్పంటించి పరారయ్యారు. తిరిగి మరుసటి రోజు రాత్రి భగత్ సింగ్ కాలనీ, శివ్‌విహార్‌లో రెండు కార్లు, నాలుగు బైక్‌లకు నిప్పంటించారని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment