![sc sts protest at ramlila maidan over outsourcing - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/27/dalits.jpg.webp?itok=_jzZd6oM)
సాక్షి,న్యూఢిల్లీ: ప్రయివేటీకరణ, అవుట్‌సోర్సింగ్‌లను నిరసిస్తూ రాజధానిలోని రాంలీలా మైదానంలో అఖిల భారత ఎస్‌సీ, ఎస్‌టీ సంఘాల సమాఖ్య భారీ ఆందోళన చేపట్టింది. ప్రయివేటీకరణ, ఉద్యోగాల అవుట్‌సోర్సింగ్ రిజర్వేషన్ల విధానానికి ముప్పుగా పరిణమించాయని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
దేశానికి స్వాతంత్ర్యం సమకూరి దశాబ్ధాలు గడిచినా ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ, బీసీ వర్గాల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని ఎంపీ ఉదిత్ రాజ్ అన్నారు. యూపీ, బీహార్, హర్యానా, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ సంఘాలకు చెందిన కార్యకర్తలు తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment