పోలీసు పోస్టుల భర్తీకి సన్నాహాలు | Home Minister Says Recruitment Of Police Personnel For Delhi | Sakshi

పోలీసు పోస్టుల భర్తీకి సన్నాహాలు

Aug 10 2018 4:16 PM | Updated on Sep 17 2018 6:18 PM

Home Minister Says Recruitment Of Police Personnel For Delhi - Sakshi

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (ఫైల్‌ఫోటో)

 ఖాకీల నియామకానికి హోంమంత్రిత్వ శాఖ కసరత్తు..

సాక్షి, న్యూఢిల్లీ : పోలీసు ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తున్నామని, ఢిల్లీ పోలీసు విభాగంలో 4000 పోస్టుల నియామకాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని కేం‍ద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఢిల్లీలో గత నాలుగేళ్లుగా శాంతిభద్రతల పరిస్థితి మెరుగైందని, తీవ్ర నేరాలను పోలీసులు అదుపుచేయగలిగారని ప్రశంసించారు.

ఢిల్లీలో పోలీసు బలగాల నియామకం అవసరముందని, త్వరలోనే 4000 పోలీసు పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని మంత్రి వెల్లడించారు.ఢిల్లీలో శుక్రవారం నూతన డీసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఢిల్లీ పోలీసు విభాగంలో 3149 పోస్టుల నియామకానికి హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే అనుమతించిందని చెప్పారు.

దేశ రాజధానిలో ట్రాఫిక్‌ నిర్వహణ పోలీసులకు పెనుసవాల్‌గా పరిణమించిందన్నారు. కృత్రిమ మేథ ఆధారంగా ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐటీఎంఎస్‌)ను ప్రవేశపెట్టేందుకు హోంమంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement