
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీలోని గోవింద్‌పురిలో ఐదేళ్ల బాలుడిపై 55 సంవత్సరాల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లితండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలుడిని సమీపంలో నివసించే 55 ఏళ్ల వృద్ధుడు లైంగికంగా వేధించాడు. తల్లితండ్రులు తిరిగి ఇంటికి చేరుకున్న అనంతరం జరిగిన విషయాన్ని బాలుడు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసకుని దర్యాప్తు చేస్తున్నారు.
దేశ రాజధానిలో చిన్నారులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. పసిమొగ్గలను కామాంధులు చిదిమివేస్తున్న ఘటనలు పెచ్చుమీరడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment