
న్యూఢిల్లీ: రోజు రోజుకి పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఈ వారంలో వరుసగా రెండోసారి మునుపెన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరాయి. నేడు పెట్రోల్ ధరలపై రూ.0.26 పైసలు, డీజిల్ ధరలు లీటర్‌పై 27పైసల చొప్పున పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో బుధవారం పెట్రోల్ ధర రూ.89.77కు, డీజిల్ ధర రూ.83.46కు చేరింది. గత 10 రోజుల్లో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.88.37 నుంచి రూ.89.77 మధ్య హెచ్చుతగ్గులకు గురైంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 25 పైసలు పెరుగుదలతో రూ.86.30కు చేరింది. డీజిల్ ధర 25 పైసలు పెరుగుదలతో రూ.76.48కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలా ఉన్నాయి... పెట్రోల్ ధర 24 పైసలు పెరుగుదలతో రూ.92.86కు చేరింది. డీజిల్ ధర 27 పైసలు పెరుగుదలతో రూ.83.30కు ఎగసింది. ఈ రేట్లు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు.(చదవండి: ఇక 15 ఏళ్ల ప్రభుత్వ వాహనాలు తుక్కుతుక్కే!)
Comments
Please login to add a commentAdd a comment