న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ కంపెనీ మళ్లీ లాభాల్లోకి రావడమే కాకుండా, రికార్డ్ స్థాయి త్రైమాసిక లాభాన్ని ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్‌లో సాధించింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమాన సర్వీసులను నిలిపేసినప్పటికీ, ఈ కంపెనీ ఈ క్యూ1లో రూ.262 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో రూ.38 కోట్ల నికర నష్టాలు వచ్చాయని స్పైస్‌జెట్ తెలిపింది. గత క్యూ1లో రూ.2,253 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.3,145 కోట్లకు పెరిగిందని పేర్కొంది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల నిలిపివేత.. ఈ జూన్ క్వార్టర్‌లో బాగానే ప్రభావం చూపించిందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కిరణ్ కోటేశ్వర్ తెలిపారు. ఈ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, నిర్వహణ ఆదాయం రూ.2,220 కోట్ల నుంచి రూ.3,002 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. సగటు విమాన చార్జీ 11 శాతం పెరిగిందని పేర్కొన్నారు.
107 విమానాలతో సర్వీసులు
ఈ ఏడాది అక్టోబర్ కల్లా బోయింగ్ 737 ఎన్‌జీ విమానాలను 5–10 వరకూ కొత్తగా సర్వీసుల్లోకి తీసుకోనున్నామని కోటేశ్వర్ తెలిపారు. జూన్ చివరినాటికి మొత్తం 107 విమానాలతో సర్వీసులనందిస్తున్నామని ఆయన వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలోస్పైస్‌జెట్ షేర్ 1 శాతం లాభంతో రూ.138 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment