
ప్రతీకాత్మకచిత్రం
ఇంటి ఎదుట మూత్రం పోశాడని..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. వాయువ్య ఢిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతంలో తన ఇంటి ముందు ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడని దాడి చేయడంతో జరిగిన ఘర్షణలో ఒకరు మరణించారని పోలీసులు చెప్పారు. మృతుడిని నెహ్రూ క్యాంప్ స్లమ్‌కు చెందిన లిలూగా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. లిలూ ఇంటి వద్ద మాన్ సింగ్ (65) మూత్ర విసర్జన చేయడంతో లిలూ మాన్‌సింగ్‌పై చేయిచేసుకోగా ఘర్షణ జరిగింది. మాన్‌సింగ్ కుమారులు రవి, నీల్‌కమల్ అక్కడికి చేరుకుని సిమెంట్ స్లాబ్‌తో లిలూపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన లిలూ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్సకు తరలిస్తుండగా మరణించాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.