
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో అత్యల్ప సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం మరింత ఊరటనిచ్చింది. గడిచిన 24గంటల్లో 89కేసులు మాత్రమే నమోదయ్యాయి. సోమవారం నమెదైన కేసులు 2021 సంవత్సరంలోనే అత్యంత తక్కువగా రికార్డులు చెబుతున్నాయి.అంతేకాకుండా కొవిడ్ పాజిటివిటీ రేటు కూడా 0.16శాతానికి పడిపోయింది.
ప్రస్తుతం ఢిల్లీ లో వెయ్యి 1996మంది కొవిడ్ చికత్స పొందుతున్నారు. 563 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. మార్చి 10న నమోదైన 1900 యాక్టివ్ కేసుల తర్వాత మళ్లీ అంత తక్కువ సంఖ్యలో నమోదు కావడం ఇదే మెదటి సారి .ఇప్పటి వరకూ ఢిల్లీలో 14లక్షల 32వేల 381 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.గడిచిన 24గంటల్లో 24మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 24వేల 925కు చేరింది.
చదవండి:గడ్డకట్టే చలిలో.. 18 వేల అడుగుల ఎత్తున యోగాసనాలు
Comments
Please login to add a commentAdd a comment