
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టికి ఢిల్లీ ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి.ఎక్కడికక్కడ రహదారులపై నీళ్లు నిలువడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా చోట్ల రోడ్లు మీద గుంతలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నజాఫ్‌గఢ్‌లో ప్రధాన రహదారి మీదగా వస్తున్న ట్రక్కు రోడ్డు మీద ఏర్పడిన గుంతలో పడిపోయింది. లారీ వెళ్తుండగా ఒక్కసారిగా రోడ్డు కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#WATCH | Delhi: A truck fell into a caved in portion of the road in Najafgarh pic.twitter.com/MfW8iRigsO
— ANI (@ANI) May 20, 2021