న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల వసూలులో పీహెచ్‌డీ చేసిందని మండిపడ్డారు. ఆయన ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరు పై మండిపడ్డారు.ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నుల ద్వారా కన్నా పెట్రోలు, డీజిల్‌ల నుంచి ఎక్కువ ఆదాయాన్ని ప్రభుత్వం పొందుతోందని చెప్తున్న ఓ పత్రిక కథనాన్ని జత చేస్తూ ఈ ట్వీట్ చేశారు.
పెట్రోలు, డీజిల్ ధరలు ఒక రోజు నిలకడగా ఉన్నాయి. ఆ తర్వాత ఆదివారం మళ్ళీ పెరిగాయి. దేశంలోని చాలా నగరాల్లో లీటరు పెట్రోలు ధర రూ.100 దాటింది. మరికొన్ని నగరాల్లో ఈ ధర రూ.100కు చేరువలో ఉంది. భోపాల్‌లో అత్యధికంగా లీటరు పెట్రోలు ధర రూ. 105 గా వుంది.
చదవండి:అత్యాచారం కేసు.. మాజీ మంత్రి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment