centeral government
-
ఇప్పుడు తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందంటావా..!
ఇప్పుడు తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందంటావా..! -
గృహ నిర్మాణం పై ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ప్రశంసలు
-
కార్మికుల సంక్షేమానికి ఈ–శ్రమ్
అక్కయ్యపాలెం(విశాఖ ఉత్తర): అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ఈ శ్రమ్ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న వారి సమాచారం సేకరించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సాయం, నష్ట పరిహారం నేరుగా కార్మికులకు అందించేందుకు ఈ శ్రమ్ పోర్టల్ దోహదపడుతుంది. తుపానులు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తులు సంభవించినపుడు ఆ ప్రాంతంలో అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం సాయం అందించాలంటే తహసీల్దార్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ తమ సిబ్బందితో ముందుగా సర్వే నిర్వహిస్తారు. బాధిత కార్మికుల వివరాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తారు. అనంతరం నష్టపరిహారం మంజూరవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. ఈ విధమైన సర్వేలో అవకతవకలు జరగడానికి, అలాగే అసలైన కార్మికులకు కాకుండా అనర్హులను జాబితాలో చేర్చే అవకాశం ఉంది. అదే ఈ శ్రమ్ పోర్టల్‌లో అసంఘటిత కార్మికులు తమ వివరాలను నమోదు చేసుకుంటే విపత్తులు సంభవించినపుడు ఆ ప్రాంతంలో ఎంత మంది ఆసంఘటిత కార్మికులు ఉన్నారన్న విషయం క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ శ్రమ్ గుర్తింపు కార్డు ఉంటే కార్మికులు ప్రభుత్వ పథకాలను సులువుగా పొందవచ్చు. ఈ గుర్తింపు కార్డు దేశంలో ఎక్కడైనా పనిచేస్తుంది. ఈ శ్రమ్ కార్డు అంటే... ఈ శ్రమ్ గుర్తింపు కార్డు ప్రభుత్వం జారీ చేస్తుంది. ఆధార్ నంబర్లా దేశ వ్యాప్తంగా కార్మికుడికి ఒక గుర్తింపు సంఖ్య ఉంటుంది. 12 అంకెల నంబర్‌తో గుర్తింపు కార్డు మంజూరు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అనేక పథకాలు ప్రారంభిస్తున్నప్పటికీ చాలా మంది వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కానీ ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే కార్మికుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే ఆర్థిక సాయం నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. మెరుగైన ఉపాధి అవకాశాలకు నైపుణ్యాల అభివృద్ధికి సహాయం లభిస్తుంది. కార్డుతో ప్రయోజనాలు అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే వారికి రూ.2 లక్షల ప్రమాదబీమా సౌకర్యం లభిస్తుంది. అంగవైకల్యం పొందితే రూ.లక్ష లభిస్తుంది. నమోదు కావాలంటే... ఈశ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హులైన వారు సమీప మీ సేవ, సీఎస్సీ సెంటర్లు, గ్రామ వార్డు సచివాలయాలు, పోస్టాఫీసుల్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు ఈ పథకంలో నమోదు కొరకు ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ నంబర్, సెల్‌ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం నేరుగా కార్మికులు/నామిని ఖాతాకు జమ అవుతుంది. మరిన్ని వివరాలకు జిల్లా ఉప కార్మిక శాఖ కార్యాలయంలో లేబర్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. అసంఘటిత కార్మికులంటే ఎవరు? ఈఎస్ఐ, ఈపీఎఫ్ సభ్యత్వం లేని ప్రతి కార్మికుడు అసంఘటిత కార్మికుడే. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ రంగ కూలీలు, ఇళ్లల్లో, దుకాణాల్లో పనిచేసే కార్మికులు, కొరియర్ బాయ్స్, తోపుడు బండి కార్మికులు, వలస కార్మికులు, డొమెస్టిక్, అగ్రికల్చర్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్, ఆశ వర్కర్లు, అంగనవాడీ వర్కర్లు, మత్స్యకార్మికులు, ప్లాంటేషన్ వర్కర్స్, పాల వ్యాపారులు, చిరు వ్యాపారులు, ట్యూషన్ టీచర్లు, చేతి వృత్తుల వారు, కార్పెంటర్లు, ప్లంబర్స్ ఇలా చాలా రకాల పనులు చేసే కార్మికులు అసంఘటిత రంగంలోకి వస్తారు. (చదవండి: గొప్ప యజ్ఞాన్ని అడ్డుకోవాలని చూశారు, కానీ.. ఆపలేకపోయారు: సీఎం జగన్) -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ. 19,675 కోట్లు ఖర్చు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ల కొనుగోలుకు ఈనెల 20వ తేదీ దాకా రూ. 19,675 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేశామని సామాజిక కార్యకర్త అమిత్ గుప్తా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సమాధానమిచ్చింది. 2021–22 కేంద్ర బడ్జెట్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 35,000 కోట్లను కేటాయించింది. ఈ ఏడాది జనవరి 16న మనదేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. కోవిన్ పోర్టల్ ప్రకారం దేశంలో ఇప్పటిదాకా 140 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. మే 1 నుంచి డిసెంబరు 20వ తేదీ దాకా 117.56 కోట్ల డోసులను ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో (సీవీసీ) ప్రజలకు ఉచితంగా అందజేశామని, 4.18 కోట్ల డోసులను మాత్రం ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రజలు తీసుకున్నారని ఆరోగ్య శాఖ వివరించింది. జూన్ 21న మార్చిన నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తయారీ సంస్థలు తమ నెలవారీ ఉత్పత్తి సామర్థ్యంలో 25 శాతం టీకాలను ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా అమ్ముకోవచ్చు. 60 శాతం మందికి డబుల్ డోస్ దేశంలో అర్హులైన వారిలో (18 ఏళ్లకు పైబడిన వారిలో) 60 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం వెల్లడించారు. 89 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకున్నారని తెలిపారు. కాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గురువారం 300 దాటింది. -
భర్తీ చేయకుండా నిర్వీర్యం చేస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ట్రైబ్యునళ్లలో ఖాళీలు భర్తీ చేయకుండా వాటిని నిర్వీర్యం చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అహనం వ్యక్తం చేసింది. వారంలోగా తీరు మార్చుకోవాలని పేర్కొంది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్, ఢిల్లీ బార్ అసోసియేషన్, స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ మధ్యప్రదేశ్, అమర్జీత్ సింగ్ బేడిలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నాగేశ్వరరావులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు వాఖ్యలు చేసింది. మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి: కోర్టు తీర్పుల్ని కేంద్రం గౌరవించడంలేదని స్పష్టంగా అర్థమవుతోందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. ట్రైబ్యునళ్లలో ఎన్ని ఖాళీలు భర్తీ చేయాలో చెప్పండి, ఆయా అంశాలపై ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏడాదిన్నరగా ఖాళీలు భర్తీ కాక మూసివేత దశలోకి వచ్చేలా ఉన్నా... ట్రైబ్యునళ్లలో ఎందుకు నియామకాలు చేపట్టడం లేదని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తమకు మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. 1. కొత్త చట్టం అమలుపై స్టే ఇచ్చి ట్రైబ్యునళ్లను మూసివేయడం. 2. సుప్రీంకోర్టే ట్రైబ్యునళ్లలో ఖాళీలు భర్తీ చేయడం. 3. కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టడం. కేంద్రంతో ఘర్షణ పడాలని తాము భావించడం లేదని, ఇటీవల సుప్రీంకోర్టుకు తొమ్మిది మంది న్యాయమూర్తుల నియామకం విషయంలో కొలీజియం సిఫారసులను ఆమోదించినందుకు సంతోషంగా ఉందని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అయితే, ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఖాళీలతో చైర్పర్సన్లు, సభ్యులు లేక ట్రైబ్యునళ్లు కూలిపోయేలా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఖాళీలు భర్తీ చేయకుండా వాటి నిర్వీర్యానికి కారణం అవుతున్నారని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు అన్నారు. కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ట్రైబ్యునళ్లను మూసివేసే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ‘ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం నోటిఫై అయినట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కొత్త చట్టం ఖాళీల భర్తీకి మార్గం సుగమం చేస్తుంది. సెర్చ్, సెలక్షన్ కమిటీ సిఫారసులను కేంద్రం తీసుకుంటుంది’ అని తుషార్ మెహతా తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ), నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)వంటి వాటిల్లో అనేక ఖాళీలున్నాయని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ట్రిబ్యునళ్లలో ఖాళీల వల్ల అనేక కేసులు పరిష్కారం కావడం లేదన్నారు. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా బ్యూరోక్రాట్లతో సమావేశమై పలు పేర్లు సిఫారసు చేశామని, అయినా నియామకాలు చేపట్టలేదని... ఇదంతా వృథా ప్రయాస అయిందని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఖాళీల భర్తీకి సంబంధించి వివరాలను తదుపరి విచారణకు అందజేస్తామని మెహతా చెప్పడంతో ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని ధర్మాసనం పేర్కొంది. ‘‘మీపై మాకు విశ్వాసం ఉంది. ఇలాంటి చట్టాలు చేయమని ప్రభుత్వానికి ఎప్పుడూ సూచించరు . ప్రభుత్వం దగ్గర ఉండే కొందరు బ్యూరోక్రాట్లు సలహాలు ఇస్తారు. ఒకవేళ ఏదైనా తీర్పు వస్తే కొత్త చట్టం రూపొందించమని చెబుతారు. ప్రస్తుతం బ్యూరోక్రసీ పనితీరు ఇలా ఉంది. అది మాకు తెలుసు. కానీ సీరియస్ అంశం కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఏదిఏమైనప్పటికీ మేమెంతో నిరుత్సాహం చెందాం. మేం చెప్పదలచుకున్నది ఇదే’’ అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి సీజేఐ వ్యాఖ్యానించారు. మూడు నాలుగు రోజులపాటు సమయం ఇస్తే... ఈలోగా భర్తీ చేస్తామని తుషార్ మెహతా చెప్పడంతో సోమవారానికి విచారణ వాయిదా వేస్తున్నామని కోర్టు పేర్కొంది. సోమవారానికి ఖాళీల భర్తీ కాకుంటే ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీకి పది రోజులు సమయం ఇస్తూ ధర్మాసనం ఆగస్టు 16న ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ట్రైబ్యునల్ సభ్యుల పదవీకాలం తగ్గించడం, ఇతర సేవలను తగ్గిస్తూ కేంద్రం తీసుకొచి్చన ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం, 2021ను ఇటీవల పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. ట్రిబ్యునల్ సభ్యుడు లేదా చైర్పర్సన్ నియామకానికి కనీస వయసు 50 ఏళ్లు ఉండాలన్న నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, ట్రైబ్యునళ్ల చైర్పర్సన్ల పదవీకాలం ఐదేళ్లు ఉండాలని ఆ మేరకు చట్టంలో పొందుపరచాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇవే అంశాలు మళ్లీ కొత్త చట్టంలో రావడంతో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయా అంశాలు కేంద్రం విస్మరించడంతో తమ తీర్పులు పాటించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. గతంలో కొట్టివేసిన చట్టానికి కొత్త చట్టం అచ్చు నకలులా ఉందని పేర్కొంది. -
వ్యాక్సిన్ పరీక్షల కోసం హైదరాబాద్ ల్యాబ్
న్యూఢిల్లీ: దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లను పరీక్షించి, అనుమతులు జారీ చేసేందుకు కేంద్రం మరో సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ (సీడీఎల్) ఏర్పాటు చేసినట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీ (ఎన్ఐఏబీ)ని సీడీఎల్‌గా ఎంపిక చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సీడీఎల్‌గా మార్చగల సాంకేతిక ఉన్న ల్యాబొరేటరీని ఎంపిక చేయాలని గతేడాది నవంబర్‌లో కేబినెట్ సెక్రటరీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా రెండు ల్యాబొరేటరీలను డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) కేంద్రానికి సూచించింది. అందులో పుణేకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్ (ఎన్‌సీసీఎస్), హైదరాబాద్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీ (ఎన్ఐఏబీ)లు ఉన్నాయి. ఇందులో ఎన్‌సీసీఎస్‌ను ఈ ఏడాది జూన్ 28న సీడీఎల్‌గా ప్రకటించగా, తాజాగా ఎన్‌ఐఏబీని కూడా సీడీఎల్‌గా ప్రకటించారు. వీటికి పీఎం కేర్స్ నుంచి నిధులు అందుతాయి. తయారైన ప్రతీ బ్యాచ్ వ్యాక్సిన్‌ను ఈ కేంద్రాల్లో పరీక్షించి, ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ధ్రువీకరించాల్సి ఉంటుంది. తగినన్ని పరీక్షా కేంద్రాలు లేకపోవడంతో వ్యాక్సిన్ బ్యాచ్‌లను విడుదల చేయడంలో ఆలస్యమవుతోంది. -
దివ్యాంగులకు వరం.. యూడీ కార్డ్
ఏలూరు (టూటౌన్): దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనే సంకల్పంతో ప్రభుత్వం తీసుకువచ్చిన యూడీ ఐడీ (యూనిక్ డిజెబిలిటీ ఐడెంటిటీ కార్డ్) వారికి వరంగా మారింది. ఏదోక వైకల్యం ఉన్న వారు ఎక్కడికైనా వెళ్లాలంటే తమ వద్ద ఉన్న అర్హత పత్రాలు అన్నింటినీ గతంలో వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఈ సమయంలో పొరపాటున ఏదైనా పత్రం పోతే తిరిగి దాన్ని పొందేందుకు అనేక అవస్థలు పడాల్సి వచ్చేది. ఈ సమస్యలు లేకుండా దివ్యాంగులకు మేలు చేయాలనే లక్ష్యంతో యూడీ ఐడీ కార్డును ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. అర్హులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 54,052 మంది దివ్యాంగులు ఉన్నారు. వీరందరికీ యూడీ కార్డులను జారీ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ నుంచి జిల్లా కేంద్రంలోని దివ్యాంగుల సంక్షేమ శాఖకు ఆదేశాలు అందాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యూనిక్ గుర్తింపు కార్డులో దివ్యాంగుని పేరు, గుర్తింపు సంఖ్య, పుట్టిన తేదీ, వైకల్య శాతం, జారీ చేసిన తేదీ, కార్డు ఎప్పటివరకూ పనిచేస్తుంది, కార్డు వెనుక వైపు సదరం గుర్తింపు ఐడీ నంబర్, క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. దీనిని కోడింగ్ చేస్తే పూర్తి వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా తొలి, మలి విడతల్లో 9,984 గుర్తింపు కార్డులు మంజూరు చేశారు. కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా జరుగుతుంది. దరఖాస్తు విధానం ఇలా.. https://www.swavlambancard.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లైఫర్ సర్టిఫికెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తరువాత దివ్యాంగుడి వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. రెండో కాలమ్‌లో చిరునామా, గుర్తింపు కార్డు వివరాలు, శాశ్వత చిరునామా పొందుపర్చాలి. మూడో కాలమ్‌లో వైకల్య వివరాలు, నాలుగో కాలమ్‌లో ఎంప్లాయిమెంట్, దివ్యాంగుని గుర్తింపు వివరాలు నమోదు చేయాలి. ఫొటో, వేలిముద్ర లేక సంతకం చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. దరఖాస్తు పూర్తయిన తరువాత పరిశీలించి గుర్తింపు కార్డులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇప్పటివరకు 9,984 కార్డులు మంజూరు జిల్లాలో ఇప్పటివరకూ 9,984 యూడీ కార్డులు మంజూరు చేశాం. దివ్యాంగులకు సంబంధించిన అన్ని వివరాలు ఒకే కార్డులో పొందుపర్చడం వల్ల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై ఎటువంటి సందేహాలు ఉన్నా జిల్లా కేంద్రం ఏలూరులోని కలెక్టరేట్ కాంపౌండ్‌లో ఉన్న మా కార్యాలయానికి వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు. – ఎం.ఝాన్సీరాణి, సహాయ సంచాలకులు, వికలాంగుల సంక్షేమ శాఖ -
పన్నుల వసూళ్లులో కేంద్రం పీహెచ్డీ: రాహుల్
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల వసూలులో పీహెచ్డీ చేసిందని మండిపడ్డారు. ఆయన ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరు పై మండిపడ్డారు.ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నుల ద్వారా కన్నా పెట్రోలు, డీజిల్‌ల నుంచి ఎక్కువ ఆదాయాన్ని ప్రభుత్వం పొందుతోందని చెప్తున్న ఓ పత్రిక కథనాన్ని జత చేస్తూ ఈ ట్వీట్ చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలు ఒక రోజు నిలకడగా ఉన్నాయి. ఆ తర్వాత ఆదివారం మళ్ళీ పెరిగాయి. దేశంలోని చాలా నగరాల్లో లీటరు పెట్రోలు ధర రూ.100 దాటింది. మరికొన్ని నగరాల్లో ఈ ధర రూ.100కు చేరువలో ఉంది. భోపాల్‌లో అత్యధికంగా లీటరు పెట్రోలు ధర రూ. 105 గా వుంది. చదవండి:అత్యాచారం కేసు.. మాజీ మంత్రి అరెస్ట్ -
ఆంధ్రప్రదేశ్ రైతులకూ నేరుగా సబ్సిడీ
న్యూఢిల్లీ: 14 రాష్ట్రాల్లో గత నెలలో కేంద్రం ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాన్ని వచ్చే నెలనుంచి ఆంధ్రప్రదేశ్‌తో పాటు 5 రాష్ట్రాల్లో అమలు చేయనుంది. ఇందులో భాగంగా ఎరువుల రాయితీని నేరుగా రైతుల ఖాతాలోకే ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు తెలిపారు. ప్రతియేటా రూ. 70వేల కోట్ల ఎరువులను కేంద్రం రైతులకు సబ్సిడీమీద అందజేస్తోంది. వచ్చే నెల నుంచి పంజాబ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఏపీలోని రైతులకు ఈ డీబీటీ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి తెలిపారు. -
గ్యాస్‌కు ఆధార్ గుదిబండ
సాక్షి, ప్రతినిధి, నెల్లూరు : సంక్షేమ పథకాలకు కోతపెట్టే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. వంటగ్యాస్‌పై రాయితీని తగ్గించుకునేందుకు కేంద్రం ఆధార్ అనుసంధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. గ్యాస్‌పై రాయితీ పొందాలంటే ఈనెల 31వ తేదీలోపు లబ్ధిదారులు ఆధార్ నంబరును అనుంధానం చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. గ్యాస్ ఏజెన్సీల్లో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసుకోకుంటే వచ్చేనెల నుంచి సిలిండర్‌పై నగదు బదిలీ వర్తించదని తేల్చి చెప్పింది. ఓవైపు సుప్రీంకోర్టు సంక్షేమ పథకాలకు ఆధార్ లింకు పెట్టొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. గ్యాస్ నిర్వాహకులు సిలిండర్ రాయితీపై ఆంక్షలు సడలించలేదు. దీంతో గ్యాస్ లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అనుసంధానం చేయాల్సిందే జిల్లావ్యాప్తంగా మొత్తం 4,76,920 మంది గ్యాస్ లబ్ధిదారులు ఉన్నారు. భారత్, ఎచ్పీ, ఇండియన్ గ్యాస్ కంపెనీల నుంచి లబ్ధిదారులు కనెక్షన్లు పొంది ఉన్నారు. ఈ గ్యాస్ సరఫరా మొత్తం 52 మంది డీలర్ల నుంచి పంపిణీ జరుగుతోంది. అయితే 3,93,712 మంది లబ్ధిదారులు ఆధార్ నంబరు అనుసంధానం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 83,212 మంది ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. అయితే అనధికారికంగా లక్షమందికిపైగా ఉన్నట్లు సమాచారం. లబ్ధిదారులకు అందించే ప్రతి సిలిండర్‌కు కేంద్రం రాయితీ ఇస్తుంది. కంపెనీ ధర ప్రకారం సిలిండర్‌కు రూ.860లు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రం రాయితీ మీద రూ.472లకే అందజేస్తున్న విషయం తెలిసిందే. గ్యాస్ పథకానికి కేంద్రం ఆధార్ అనుసంధానం చేసి లబ్ధిదారుని ఖాతాకే నేరుగా రాయితీ నగదును బదీలీ చేసే విధం గా చర్యలు చేపట్టింది. ఇందుకుగాను లబ్ధిదారుడు ఆయా ఏజెన్సీల్లో ఆధార్‌తో పాటు బ్యాంకు ఖాతా నంబర్‌ను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ అనుంధానానికి 31 గడువు గ్యాస్ లబ్ధిదారులు ఆధార్ అనుంధానానికి ఈనెల 31 చివరి గడువుగా విధించారు. అందులో భాగంగా లీడ్ బ్యాంక్ మేనేజనర్ డి వెంకటేశ్వరావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ నుంచి లబ్ధిదారులకు తప్పనిసరిగా నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయునున్నట్లు తెలిపారు. ఆధార్ అనుంధానం చేసుకోని లబ్ధిదారులు సిలిండర్‌కు మొత్తం ధర ను చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆధార్ అనుసంధానం చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీని నగదు బదిలీ పథకం ద్వారా ఖాతాకు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ చెప్పిన విధంగా.. లబ్ధిదారుడు ముందు సిలిండర్‌కు సంబంధించి మొత్తం ధర చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకోని వారు, ఎన్రోల్మెంట్ చేసుకున్నా.. నంబర్ రాని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఆయా కంపెనీలకు చెందిన డీలర్లు మాత్రం ఆధార్ నంబరు అనుసంధానం చేయకుంటే నగదు బదిలీ పథకం వర్తించదని తెగేసి చెబుతున్నారు. దీంతో జిల్లాలో ఆధార్ లేని లక్షమందికి వచ్చేనెల నుంచి వంటగ్యాస్ రాయితీ వర్తించదని అధికారులు తేల్చిచెబుతున్నారు. లక్షమందికి వచ్చేనెల నుంచి ఒకరికి రూ.388 చొప్పున మొత్తం రూ.3.88 కోట్లు అదనపు భారం పడనుంది. సుప్రీం ఆదేశాలుకు బేఖాతర్ సంక్షేమ పథకాలకు ఆధార్ లింకు పెట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే సుప్రీం ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బేఖాతరు చేస్తూ సంక్షేమ పథకాలకు ఆధార్ లింకును ముడిపెడుతున్నాయి. దీంతో ఆయా లబ్ధిదారులు ఆధార్ లింకుతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పేద, మధ్య తరగతికి చెందిన వర్గాలు మాత్రమే ఆధార్‌కార్డు అనుసంధానంలో వెనుకబడినట్లు తెలుస్తుంది. వీరందరిపై వచ్చేనెల నుంచి వంటగ్యాస్‌కు భారం పడనుంది. వంటగ్యాస్‌కు ఆధార్ నెంబరు ముడిపెట్టడంపై ఆయ వర్గాలకు చెందిన ప్రజలు మండిపడుతున్నారు.