
చోడవరం: మాదిగ రిజర్వేషన్ పోరాట మితి (ఎమ్మార్పీఎస్) పొలిట్ బ్యూరో సభ్యుడు పెద్దాడ ప్రకాశరావు గుండెపోటుకు గురై మరణించారు. విశాఖ జిల్లా చోడవరం అంబేద్కర్ భవనంలో శనివారం రాత్రి చోడవరం, మాడుగుల నియోజకవర్గాల ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సభ నిర్వహించారు. దీనికి హాజరైన ప్రకాశరావు ప్రసంగిస్తూ సభావేదికపై కుప్పకూలిపోయారు. నాయకులు, కార్యకర్తలు అతనిని అంబులెన్స్‌లో విశాఖపట్నం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామం కంచరపాలేనికి తరలించారు.
(చదవండి: పెళ్లి చేసుకుంటానని యువతిని లోబరచుకుని..)
Comments
Please login to add a commentAdd a comment