మార్చి 10న నారావారిపల్లె నుంచి మాదిగ చైతన్య రధయాత్ర చేపడతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ వెల్లడించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇకనైనా మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. మార్చి 10న నారావారిపల్లె నుంచి మాదిగ చైతన్య రధయాత్ర చేపడతామని వెల్లడించారు.
ఈ సందర్భంగా నారావారిపల్లెలో చంద్రబాబు తల్లిదండ్రుల విగ్రహాల వద్ద నివాళులు ఆర్పిస్తామని చెప్పారు. ఏప్రిల్ 30న విజయవాడలో 10 లక్షల మందితో మాదిగల విశ్వరూప మహాసభను నిర్వహిస్తామని మందకృష్ణమాదిగ తెలిపారు.