ఇద్దరు ‘చంద్రులదీ’ ఒకే దారి
వినాయక్‌నగర్ : రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖర్‌రావులది ఒకేదారని, మాదిగలకు పట్టిన గ్రహాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్య వస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. శనివారం ఆయన నిజామాబాద్‌లో ని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో మా ట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే దళి తుడి ముఖ్యమంత్రినే చేస్తానని పలుమార్లు చెప్పిన కేసీఆర్ దురహంకారంతో తానే ఆ కుర్చీలో కూర్చున్నారని మండిపడ్డారు.
టీఆర్‌ఎస్ పుట్టినప్పటి నుంచి పని చేసిన కొప్పుల ఈశ్వర్‌ను కొడుకు కోసం బలి చేశారన్నారు. కేసీఆర్ చేయించిన సర్వేలో నల్లాల ఓదెలు తెలంగాణలోనే ప్రథమస్థానంలో నిలిచినా మంత్రి పదవికి నోచుకోవడంలో చివరకు కూడా నిలవలేదన్నారు. పార్టీలు మారిన ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి నాలుగుసార్లు గెలిచిన నల్లాల ఓదెలును పక్కకు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ దళితులపై చూపుతున్న వివక్షకు ఇదే తార్కాణమన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిం చిన మహిళలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. అధికారంలోకి వచ్చిన రెండునెలలలో నిజాం చక్కెర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుంటమన్న మాటలు మరుగున పడేసారన్నారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌గా ఘం టా చక్రపాణి నియామకంతో మాదిగలకు అన్యా యం జరిగిందన్నారు. మాదిగల రుణం తీర్చుకుం టామన్న ఇద్దరు ముఖ్యమంత్రులు గట్టుకెక్కినాక తెప్పకాల బెట్టారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు మాదిగలె అండగా ఉన్నారన్నారు.
చంద్రబాబు తెలంగాణలో పాద యాత్ర చేసేసమయంలో మాదిగలు ముందుండి జైలుకు వెళ్లడంతోపాటు, ఆదిలాబాద్ జిల్లా బైంసా నుంచి తిరుగు ప్రయాణంలో ముగ్గురు మాదిగలు మృతి చెందారని గుర్తు చేశారు. మహిళలను విస్మరించిన కేసీఆర్ కల్లు తెరిపించేవిధంగా మార్చి7వతేదీన మహిళలతో హైదరాబాద్‌లో మహాయాత్ర నిర్వహిస్తామన్నారు.
తెలంగాణలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రెండుగా చీలి టీఎంఆర్‌పీఎస్‌గా కర్యక్రమాలు నిర్వహిస్తున్నారు, కలిసి పోరాడితే ఏదైనా తొందరగా సాధిం చవచ్చుకదా అని విలేకరులు ప్రశ్నించగా వారు ప్రభుత్వం ఏజేంట్లు,పాలకులకు అమ్ముడుపోయి,పాలేరుల పనిచేస్తున్నరని మందకృష్ణ విమర్శిం చారు. సమావేశంలో జిల్లాఅధ్యక్షులు గందమాల నాగభూషణం,మైలారం బాలు,కిష్టయ్య,గంగాధర్ తార, తదితరులు పాల్గొన్నారు.