దగదర్తి మండలం కాట్రాయపాడు గ్రామ సర్వే నంబర్ 152/2లో అయిదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఎనిమిది కుటుంబాల మాదిగలు గత యాభైఏళ్లుగా సాగు చేసుకుని బతుకుతున్నారు. వారిలో నలుగురికి డి.కె. పట్టాభూములు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. వాటిపై అనేకసార్లు వ్యవసాయ రుణాలు కూడా తీసుకున్నారు. ఆ ఎనిమిది కుటుంబాలు సాగులో ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో కూడా ఉంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వరినాట్లకు సిద్ధం కాగా, తెలుగుదేశం నేత మాలపాటి రవీంద్రనాయుడు, అతడి అనుచరులు 50 మంది నవంబర్ 25న మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్‌లో వచ్చి నారు మడిని తొక్కించారు.
ఇలా రెండు మూడు పర్యాయాలు దళితులు మళ్లీ నాట్లు వేయడం రవీంద్రనాయుడు, మాధవరం శ్రీహరి (బాడుగు పాడు) తమ అనుచరులతో మళ్లీ దాడి చేసి నారుమడిని తొక్కించడం జరిగింది. ఈ అన్యాయంపై స్పందించాల్సిన పోలీసులు తెలుగుదేశం నేతలతోనే జత కట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మాదిగలు జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసినా వారు కూడా దళితుల మొర వినలేదు. డిసెంబర్ 2న మాదిగలు మళ్లీ వరినాటితే 17వ తేదీన మాదిగవాడపై దాడిచేసి పైరను తొక్కించారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీలుగా రవీంద్రనాయుడి అక్క మాలపాటి లలిత, తమ్ముడు సుబ్బానాయుడు పోటీ చేయగా దగదర్తి జడ్‌పీటీసీగా నాయుడి వదిన మాలపాటి పద్మావతి పోటీచేశారు. లలితమ్మ, పద్మావతి గెలువగా, సుబ్బానాయుడు ఓడిపోయాడు.
కాట్రాయపాడు మాదిగలు ఓట్లేయ నందునే కేవలం 14 ఓట్ల తేడాతో తన తమ్ముడు ఓడిపో యాడన్న కక్షతో వారి పొలాలను మూడుసార్లు ధ్వంసం చేశారు. పైగా కేవలం చారెడు నేల ఉన్నందునే మాదిగలు తనను ధిక్కరించారని, అది లేకుండా చేస్తే అణిగి మణిగి ఉంటారని, ఆ భూమి నుండి మాదిగల్ని తరిమేసే లక్ష్యం తోనే ఈ దాడులకు పాల్పడ్డారు. మాదిగల కుండలోని గంజిలో మెతు కుల్ని కూడా సహించలేని అగ్రకుల దురహంకారంతో పైరును ధ్వంసం చేసి వారి బిడ్డల నోటికాడి కూడును కాలితో తన్నారు. 1979 నుండి కాట్రాయపాడు మాదిగలకు పలుమార్లు ప్రభుత్వం దాదాపు 430.66 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. కాని వారి వద్ద పట్టాలు, పాస్ పుస్త కాలు మాత్రమే ఉండగా భూమి మాత్రం రవీంద్ర నాయుడి అనుచ రుల కబ్జాలో ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం 430 ఎకరాల భూమిలో కేవలం 5 ఎకరాలు మాత్రమే మాదిగలు సాగుచేసుకుంటున్నారు అది కూడా లేకుండా చేయాలని రవీంద్రనాయుడు, అతడి ముఠా దౌర్జన్యా లకు తెగబడుతోంది.
టీడీపీ అధికారంలోకి వచ్చాక రవీంద్రనాయుడి దౌర్జన్యాలకు అడ్డూ అదుపూలేకుండాపోయింది. పైగా బహిరంగంగానే కాట్రాయపా డును మరో కారంచేడును చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఎప్పు డు పల్లెపైదాడి చేస్తారోనని మాదిగలు బిక్కుబిక్కుమంటూ గడుపుతు న్నారు. దగదర్తి మండలంలో సుమారు 7 వేల ఎకరాల భూమి అగ్ర కుల భూస్వాముల కబ్జాలో ఉంది. దీంట్లో సగం భూమికి డికె పట్టాలు, పాస్ పుస్తకాలు ఉన్నా, భూమి మాత్రం రవీంద్ర నాయుడి అనుచరుల చేతిలోనే ఉంది. పైగా వయోవృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లు, వ్యవసాయ రుణాలు అన్నీ రవీంద్రనాయుడి ఇష్టప్రకారమే జరగాలి.
మండలంలో చీపురుపుల్ల కూడా అతని ఇష్టానికి భిన్నంగా కదిలితే సహించడు. ఎవరు అధికారంలో ఉంటే వారిదే రాజ్యం, వారు చేసిందే శాసనం, వారు చెప్పిందే చట్టం అయితే ఇక రెవెన్యూ, పోలీసు, కోర్టులు ఎందుకున్నట్లు? కాట్రాయపాడు మాదిగల పైర్లను ధ్వసం చేసిన రవీంద్రనాయుడు, అతని అనుచరులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. మాదిగలకు నష్టపరిహారం చెల్లిం చాలనీ, రవీంద్ర నాయుడి తొత్తులుగా వ్యవహరిస్తున్న ఎంఆర్‌ఓ, ఎస్సై లను సస్పెండ్ చెయ్యాలనీ డిమాండ్ చేస్తున్నాం.
దుడ్డు ప్రభాకర్ కుల నిర్మూలనా పోరాట సమితి, నెల్లూరు
మాదిగల వరినాట్లు ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
Published Tue, Dec 30 2014 2:13 AM | Last Updated on Mon, Oct 8 2018 3:48 PM
Advertisement
Advertisement