ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న హక్కుల కోసం మాదిగలు గొంతులు విప్పాల్సిన అవసరం వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న హక్కుల కోసం మాదిగలు గొంతులు విప్పాల్సిన అవసరం వచ్చిం ది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తరలివచ్చే మాదిగలతో హైదరా బాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద చలో ఏపీ అసెంబ్లీ పేరిట మంగళవా రం మహాధర్నా జరుగనుంది. ఈ మహాధర్నాలో రాష్ట్రంలోని మాది గలకు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ పలు డిమాండ్లు చేయబోతున్నాం. రాజ్యాంగ సవరణ ద్వారా ఏపీ ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్దీకరణపై, కేంద్ర ప్రభు త్వానికి సిఫార్సు చేస్తూ ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తీర్మానం చేయడానికి, ప్రధాన మంత్రితో మాట్లాడటానికి సీయం చర్యలు తీసుకోవాలి.
దండోరా ఉద్యమంలో పాల్గొని అమరులైన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలి. జనాభా నిష్పత్తి ప్రకారం పథకాలు, నిధులు, లబ్ధి అందే విధంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని సవరించాలి. ఏపీ నూతన రాజధానిలోను, ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లోను మాదిగ సంక్షేమ భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. మాదిగల విద్యా వికాసాల కోసం చర్యలు చేపట్టాలి. మాదిగలంతా పెద్ద సంఖ్యలో తరలిరండి! హక్కుల కోసం గొంతులు విప్పుదాం! మాదిగ మహాధర్నా 23-12-2014 మంగళవారం ఉ. 10 గంటల నుండి, స్థలం: ధర్నా చౌక్, ఇందిరాపార్క్ వద్ద, హైదరాబాద్
- కృపాకర్ మాదిగ రాష్ట్ర మాదిగల నేత, ఒంగోలు