జెండా ఆవిష్కరిస్తున్న నాయకులు
ఆసిఫాబాద్‌అర్బన్: ఎమ్మార్పీఎస్ 25వ ఆవిర్భావ వేడుకలను జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబూ జగ్జీవన్ చౌక్ వద్ద శనివారం జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పొన్నాల నారాయణ మాట్లాడుతూ తరతరాల నుంచి మాదిగ జాతి అన్ని విధాలుగా నష్టపోతుందని, మంద కృష్ణ మాదిగ ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా సమస్యలు మాత్రం తీరడంలేదన్నారు.
నేటికీ ఉద్యమమే ఊపిరిగా ముందుకు సాగుతున్నామన్నారు. మాదిగల సమస్యలు తీరాలంటే మంద కృష్ణ మాదిగ చేపడుతున్న ఉద్యమంలో మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొని, ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధానకార్యదర్శి ఇప్ప నాగరాజు, నాయకులు అంజన్న, మోతె నారాయణ, సాగర్, నరేష్ పాల్గొన్నారు.
జెండా ఆవిష్కరిస్తున్న నాయకులు
Comments
Please login to add a commentAdd a comment