27న మాదిగ జేఏసీ జిల్లా సదస్సు | Madiga District Meeting on 27 | Sakshi
Sakshi News home page

27న మాదిగ జేఏసీ జిల్లా సదస్సు

Published Sun, Jul 24 2016 11:37 PM | Last Updated on Mon, Oct 8 2018 3:48 PM

మాట్లాడుతున్న విజయమోహన్‌ - Sakshi

మాట్లాడుతున్న విజయమోహన్‌

 వీరన్నపేట (మహబూబ్‌నగర్‌) : ఈ నెల 27వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగహంలో జిల్లా మాదిగ జేఏసీ సదస్సు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్‌చార్జ్‌ విజయమోహన్‌ తెలిపారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ  సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు సురేష్, సుందర్, నర్సింహులు, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 
  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement