ఎస్సీ వర్గీకరణ పేరిట మాదిగలను, దళితులను మోసం చేస్తున్న మందకృష్ణ మాదిగ దళితద్రోహి అని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గైని గంగారాం విమర్శించారు.
బోధన్ టౌన్ : ఎస్సీ వర్గీకరణ పేరిట మాదిగలను, దళితులను మోసం చేస్తున్న మందకృష్ణ మాదిగ దళితద్రోహి అని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గైని గంగారాం విమర్శించారు. ఆదివారం మాల మహానాడు బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గైని గంగారాం, బల్దియా చెర్మైన్ ఆనం పల్లి ఎల్లంలను డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు.
అనంతరం గైని గంగారాం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం 2004 లో తీర్పునిచ్చిందని తెలిసీ కూడా మందకృష్ణ మాదిగ వర్గీకరణ పేరుతో మాదిగలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. వర్గీకరణ పేరిట దందా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మాలలు ఏడు శాతం ఉంటే కేవలం మూడు శాతం ఉన్న ట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. దళితులకోసం మంద కృష్ణ పాటు పడితే తాము వెంట వస్తామని, దళితుల్లో చిచ్చు పెట్టి వర్గీకరిస్తే సహించేది లేదన్నారు.
మూడు సార్లు ఎమ్మెల్యేగా నిలబడిన ఆయనకు డిపాజిట్ దక్కలేదన్నారు. రాష్ట్రంలో 25 శాతం ఎస్సీ, ఎస్టీ లు ఉ న్నారని, మరో 5 శాతం బీసీలు కలిస్తే అధికారం చేజి క్కించుకోవచ్చన్నారు. బ్లాక్ మెయిల్ పోరాటాల ద్వారా దళితుల్లో చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. దళితుల హక్కులను కాపాడేదిశగా మాలమహానాడు ముందుకు సాగుతుందన్నారు. మాల మహానాడు కేవలం మాల జాతి కోసం కాకుండా అన్ని వర్గాల ప్రజలకు, దళితులకు మేలు జరిగేలా, ప్రభుత్వం నుంచి దళితులకు అందే ప్రతీ సంక్షేమ పథకం అమలుకు కృషి చేస్తామన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో దళితులకు మూడెకరాల భూమి, క ల్యాణ లక్ష్మి పథకం, సబ్ ప్లాన్ నిధులు వెయ్యి కోట్లు ప్రభుత్వం కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో మాలమహానాడు ముందు వరుసలో నిలుస్తుందన్నారు. ఉద్యమంలో ఏనాడు తెలంగాణ జెండా పట్టని మందకృష్ణ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డురంగా ఉందన్నారు. రాబోవు మంత్రి వర్గ విస్తరణలో మాలలకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. టీపీపీఎస్సీని త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. ఇళ్ళు లేని దళితులకు నిర్మించి ఇవ్వాలని కోరారు.
ఎన్‌డీఎస్‌ఎస్‌ఎల్ రైతులకు బకాయి ఉన్న చెరుకు బిల్లులు రూ. 3 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో మాల మహానాడు ను గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టం చేస్తామన్నారు. బోధన్ డివిజన్‌లో రెసిడెన్షియల్ పాఠశాలతో, అంబేద్కర్ భవన నిర్మాణానికి కృసి చేస్తామన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర కార్యద ర్శి హసన్, జిల్లా అధ్యక్షులు దయానంద్, జిల్లా ఉపాధ్యక్షుడు దశరత్, కార్యదర్శి గిరి తదితరులు పాల్గొన్నారు.