మామా.. మజాకా! | mama murders his kodalu | Sakshi
Sakshi News home page

మామా.. మజాకా!

Published Sat, Feb 18 2017 11:28 PM | Last Updated on Mon, Oct 8 2018 3:48 PM

మామా.. మజాకా! - Sakshi

మామా.. మజాకా!

– కోడలిని కిడ్నాప్‌ చేసిన మేనమామ
– తనకు దక్కదేమోననే ఉద్దేశంతోనే కిడ్నాప్‌నకు యత్నం
– బెంగళూరు వైపు తీసుకెళ్తుండగా పట్టుకున్న ధర్మవరం పోలీసులు

--------------------------------------------------------
అనంతపురం సెంట్రల్‌/ధర్మవరం అర్బన్‌ : తనకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదనుకున్నాడో ఏమో మేనకోడలిని కిడ్నాప్‌ చేయబోయి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడో మేనమామ. కాలేజీ వద్ద వదులుతానంటూ బాలికను నమ్మించి, బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకున్న అతని కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆత్మకూరు మండలం మదిగుబ్బకు చెందిన నరసింహులు కుమారుడు బోయ రాజు(23) బేల్దారి పని చేసేవాడు. రుద్రంపేట పంచాయతీలో ఉంటున్న తన అక్కబావల కుమార్తె(16) అనంతపురం కోర్టు రోడ్డులోని శ్రీసత్యసాయి కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న రాజు పథకం రచించాడు.

రోజూలాగే శనివారం కూడా తన అక్క ఇంటి వద్దకు వెళ్లాడు. కాలేజీ దగ్గర వదులుతానంటూ ఆమెను నమ్మించాడు. నిజమేనని నమ్మిన ఆ అమాయకురాలు అతని వెంట బైక్‌పై బయలుదేరింది. రుద్రంపేట వద్దకు రాగానే అనంతపురంలోకి కాకుండా బైక్‌ జాతీయ రహదారి వైపు పరుగులు పెట్టించాడు. అనుమానం వచ్చిన ఆమె నిలదీసింది. అయినా సమాధానం చెప్పకుండా బైక్‌ను వేగంగా నడిపాడు. రాప్తాడు దాటిన తర్వాత సదరు బాలిక గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు ధర్మవరం పోలీసులకు సమాచారం అందించారు. ధర్మవరంలోని విలేకరుల కాలనీ సమీపానికి బైక్‌ చేరుకోగానే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న పోలీసులు నిందితుడ్ని పట్టుకున్నారు. అనంతరం బాలికతో పాటు ఆమె మేనమామను అనంతపురం నాలుగో పట్టణ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement