తొమ్మిది నెలల పసికందుపై అత్యాచారం జరిపి, అనంతరం హత్య చేసిన దారుణ ఘటనపై హన్మకొండ నగర ప్రజలు భగ్గుమన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని టైలర్ స్ట్రీట్ పాలజెండాలో శ్రిత హత్యకు నిరసనగా మహిళలు, యువకులు అశోక జంక్షన్‌లో మానవహారం వేసి ఆందోళనకు దిగారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని, లేదంటే తమకు అప్పగించండి అంటూ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.