కల్యాణ వైభోగమే..
అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం
శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు
‘హర హర మహాదేవ.. శంభో శంకర’.. ‘ఓం నమఃశివాయ’ అంటూ శివనామస్మరణతో ఆలయూలు మారుమోగారుు..శనివారం శివపార్వతుల కల్యాణం కన్నులపండువగా జరిగింది..భక్తులు వేల సంఖ్యలోతిలకించారు..
- హన్మకొండ చౌరస్తా/ కాశిబుగ్గ
హన్మకొండ పద్మాక్షికాలనీలోని స్వయంభూ సిద్ధేశ్వరాలయంలో శనివారం ఉదయం 11.45 గంటలకు శివపార్వతుల కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య మూడు గంటలపాటు కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. ‘హర హర మహాదేవ శంభో శంకర్’.. ‘ఓం నమఃశివాయ’ అంటూ భక్తుల శివనామస్మరణతో సిద్ధేశ్వరాలయం మార్మోగింది. శివపార్వతులను పట్టువస్త్రాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేశారు. కల్యాణ మండపాన్ని పూలతో అలంకరించారు. శివపార్వతుల వివాహ వేడుకలు చూస్తున్నంత సేపు భక్తులు తన్మత్వయంతో పులకరించారు. మహాశివరాత్రి వేడుకల ఆరంభంలో భాగంగా.. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 9 గంటలకు నవగ్రహ మండప ఆరాధన, ఉత్సవ విగ్రహమూర్తులకు పంచామృతాలు, నవరసాలు, అభిషేకాలు నిర్వహించారు. వివాహానంతరం మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వివాహ వేడుకలను సుమారు మూడు వేలకుపైగా భక్తులు తిలకించారు.
కాశీవిశ్వేశ్వరాలయంలో..
కాశిబుగ్గలోని పవిత్ర కాశీ విశ్వేశ్వరాలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి శివ కల్యాణం వైభవంగా జరిగింది. సుమారు 500 మంది జంటలు ఈ శివ కళ్యాణంలో పాల్గొన్నారుు. ఆలయ అర్చకులు రవీంద్రనాథ్‌శర్మ, రజనీకాంత్‌కుమార్, ఓంప్రకాష్, రాజేష్ అత్యంత వైభవంగా స్థాని క భక్తుల సమక్షంలో కల్యాణాన్ని నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ వరకు రకరకాల కార్యక్రమాలు ఉంటాయని, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ అర్చకులు కోరారు.
శివరాత్రి పూజల్లో పాల్గొనండి
హన్మకొండ కల్చరల్ : చారిత్రాత్మక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో మ హాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని జ రుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని ఆలయ ప్రధానార్చకులు ఉపేం ద్రశర్మ తెలిపారు. 16వ తేదీ సోమవారం జరగను న్న చండీహోమంలో పాల్గొన దల్చినవారు రూ. 2,116, 19వతేదీ గురువారం అన్నపూజలో పాల్గొనదల్చినవారు రూ. 15,116 చెల్లించి రశీదు పొందాలని తమగోత్రనామాదులు నమోదు చేయించుకోవాలి. వీరికి స్వామివారి ప్రసాదములు, శేషవస్త్రాలు అంద జేయబడతారుు. దీంతోపాటు లింగోద్భవకాల పూజలో పాల్గొనేవారు రూ.11,116, అన్నపూజలో పాల్గొనే వారు రూ.3,116, శివకళ్యాణంలో పాల్గొనే వారు రూ.1,116 చెల్లించి రశీదు తీసుకోవాలన్నారు.